Boney Kapoor: ఇంతకీ శ్రీదేవి మరణానికి కారణం ఏంటి ?? సీక్రెట్ బయటపెట్టిన భర్త

|

Oct 04, 2023 | 9:41 AM

అతిలోక సుందరి శ్రీదేవిది సహజ మరణం కాదా? అమె యాక్సిడెంటల్‌గా చనిపోయిందా? అంటే అవుననే అంటున్నారు ఆమె భర్త బోనీకపూర్‌. శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టారు ఆయన. 2018లో అతిలోకసుందరి చనిపోయింది..ఆ మరణానికి భర్త బోనీ కపూరే కారణమని పుకార్లు వెల్లువెత్తాయి. ఇన్నాళ్ల తర్వాత శ్రీదేవి మరణంపై తన మనసులోని మాటలను బయటపెట్టారు బోనీ కపూర్‌. శ్రీదేవికి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టారు.

అతిలోక సుందరి శ్రీదేవిది సహజ మరణం కాదా? అమె యాక్సిడెంటల్‌గా చనిపోయిందా? అంటే అవుననే అంటున్నారు ఆమె భర్త బోనీకపూర్‌. శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టారు ఆయన. 2018లో అతిలోకసుందరి చనిపోయింది..ఆ మరణానికి భర్త బోనీ కపూరే కారణమని పుకార్లు వెల్లువెత్తాయి. ఇన్నాళ్ల తర్వాత శ్రీదేవి మరణంపై తన మనసులోని మాటలను బయటపెట్టారు బోనీ కపూర్‌. శ్రీదేవికి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టారు. శ్రీదేవి మరణానికి అసలు కారణం ఆమె స్ట్రిక్ట్ డైట్ ఫాలో కావడమే అన్నారు బోనీ కపూర్‌..శ్రీదేవిది సహజ మరణం కాదని, ప్రమాదవశాత్తు చనిపోయిందన్నారు..శ్రీదేవికి నటన అంటే ఎంతో ఇష్టం..కెమెరా ముందు అందంగా కనిపించాలని ఆమె స్ట్రిక్ట్ డైట్ చేస్తూ ఉండేదని..పెళ్లి తర్వాత ఆ విషయం తనకు తెలిసిందని బోనీ కపూర్‌ తెలిపారు. ఆమె ఉప్పు లేకుండా భోజనం చేయడంతో చాలాసార్లు ఆమె నీరసించిపోయేదని వెల్లడించారు. అంతేకాకుండా లో బీపీ సమస్య తలెత్తేదని, చాలా సార్లు ఆమె కళ్లు తిరిగినట్టు చేసేదన్నారు బోనీ కపూర్‌..జాగ్రత్తగా ఉండమని ఆమెని డాక్టర్స్ ఎంతగానే చెప్పారు. కానీ అస్సలు సీరియస్‌గా తీసుకోలేదన్నారు.. శ్రీదేవిది మరణం విషయంలో దుబాయి పోలీసులు బోనీ కపూర్‌ను ఓ రోజంతా విచారించారు. లై డిటెక్టర్ టెస్ట్ చేశారు. చివరికి ఆమె ప్రమాదవశాత్తు చనిపోయిందని నిర్ధారించారు. శ్రీదేవి చనిపోయిన కొన్నిరోజుల తర్వాత ఓ సారి తనను నాగార్జున ఓసారి కలిశారని, గతంలో కూడా డైట్ కారణంగా ఓసారి సెట్‌లో శ్రీదేవి స్పృహ తప్పి పడిపోయారని తనతో చెప్పినట్టు బోనీ కపూర్ తెలిపారు. శ్రీదేవి మృతిపై బోనీ కపూర్‌ కామెంట్స్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైతు కష్టం తీర్చిన స్టూడెంట్ !! పేటెంట్ పొంది రికార్డ్ !!

 

Published on: Oct 04, 2023 09:40 AM