ఒక్క సినిమాతో.. చేజారిన నెంబర్ వన్ పీఠంపై కన్నేసిన బాలీవుడ్

Edited By:

Updated on: Jan 22, 2026 | 4:08 PM

బాలీవుడ్ తన నెం.1 స్థానాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు సౌత్ సినిమా ఆధిపత్యం చెలాయించినా, ఇప్పుడు జవాన్, పఠాన్, ధురంధర్ వంటి విజయాలతో బాలీవుడ్ మళ్లీ గాడిలో పడింది. ధురంధర్ 1300 కోట్లు వసూలు చేసి కొత్త ఆశలు రేపింది. బోర్డర్ 2, ధురంధర్ 2 వంటి రాబోయే సినిమాలు హిందీ సినిమాకు పూర్వ వైభవాన్ని తెస్తాయని నమ్మకం ఉంది.

చేజారిపోయిన నెంబర్ 1 కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది బాలీవుడ్. ఒకప్పుడు హిందీ తర్వాతే సౌత్ మార్కెట్ ఉండేది కానీ ప్యాన్ ఇండియన్ ట్రెండ్ మొదలయ్యాక.. ముంబైను మెల్లగా సైడ్ చేసింది సౌత్ సినిమా. కానీ చాలా రోజుల తర్వాత నార్త్ ఇండస్ట్రీలో మళ్లీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మరి వాళ్ల నమ్మకానికి కారణమేంటి..? బాలీవుడ్‌లో నెక్ట్స్ పెద్ద సినిమాలేంటి..? ధురంధర్.. ధురంధర్.. గత 40 రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మార్మోగిపోతున్న పేరు ఇది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1300 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలీవుడ్‌లో పుష్ప 2 పేరు మీద ఉన్న 830 కోట్ల రికార్డ్ బద్దలుకొట్టి.. కేవలం ఇండియాలోనే 900 కోట్ల వైపు పరుగులు పెడుతుంది ధురంధర్. దీనికంటే ముందు ఛావా, యానిమల్ సత్తా చూపించాయి. గత మూడేళ్లలో జవాన్, పఠాన్, గదర్ 2, యానిమల్, ఛావా లాంటి సినిమాలతో బాలీవుడ్ మళ్లీ గాడిన పడింది. ఇక ధురంధర్‌తో చేజారిన నెంబర్ 1 తిరిగి దక్కించుకోవచ్చనే నమ్మకం కలిగింది. జనవరి 23న బోర్డర్ 2 వస్తుంది.. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.. ఇది క్లిక్ అయితే ఈజీగా 500 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయం. 30 ఏళ్ళ నాటి బోర్డర్ సినిమాకు సీక్వెల్ ఇది. ఫిబ్రవరి 13న ఓ రోమియో అంటూ వచ్చేస్తున్నారు షాహిద్ కపూర్. ఇక మార్చి 19న ధురంధర్ 2 ఎలాగూ ఉండనే ఉంది. పార్ట్ 1తోనే 1300 కోట్లు కొల్లగొట్టిన ధురంధర్.. సీక్వెల్‌తో 2000 కోట్లు వసూలు చేసి ఇండియన్ రికార్డులపై కన్నేసారు రణ్‌వీర్ సింగ్. ధురంధర్ 2 గానీ హిట్టైతే హిందీ సినిమా మళ్లీ టాప్‌లోకి వెళ్లడం ఖాయం. ఈ దూకుడుకు బ్రేక్ పడాలంటే.. అదేరోజు రానున్న టాక్సిక్ సత్తా చూపించాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్యారడైజ్ Vs పెద్ది.. ఈ ట్విస్ట్ ఊహించలేదుగా

మాకు మేమే.. మాతో మేమే అంటున్న కుర్ర హీరోలు

రూ. 6 వేల నుంచి రూ.10 వేలు !! బడ్జెట్‌లో రైతులకు సాయం పెరగనుందా ??

కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు

ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్‌ వైర్లను లెక్కచేయని తల్లి