జాక్ పాట్ కొట్టిన ఇమ్మాన్యుయేల్! బిగ్ బాస్‌ నుంచి మనోడికి దిమ్మతిరిగే రెమ్యునరేషన్‌

Updated on: Sep 12, 2025 | 12:23 PM

బిగ్ బాస్ సీజన్ 9 షురూ అయింది. కామనర్స్ అండ్ సెలబ్రిటీల తో హౌస్‌ కలకలలాడుతోంది. దాంతో పాటే ముష్టి యుద్దాలు.. అల్లర్లతో మార్మోగిపోతోంది. చూసే ఆడియన్స్‌కు కిక్కించే రేంజ్‌కు రీచ్‌ కాకున్నా.. బిగ్ బాస్ టేకాఫ్ మాత్రం ఇప్పటికైతే బానే ఉంది. ఇక ఈ షో నడిచే తీరును కాసేపు పక్కకు పెడితే.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీల రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది.

అందులో జబర్దస్త్‌ ఫేం ఇమ్మాన్యువేల్ ఈ సారి జాక్‌ పాట్ కొట్టాడని.. ఫ్యాన్సీ రెమ్యునరేషన్‌ ను బిగ్ బాస్ నుంచి పట్టాడనే టాక్ వైరల్ అవుతోంది. జబర్దస్త్‌తో పాటు.. పలు ఈవెంట్స్‌తో.. బిజీగా ఉన్న ఇమ్మాన్యుయేల్‌.. మంచి ఎంటర్‌ టైనర్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్నాడు. కొంత మంది ఫిల్మ్ మేకర్స్‌ అండ్ స్టార్స్‌ కూడా ఈ కమెడియన్‌ ను పిలిచి మరీ ఇంటర్వ్యూ చేయించుకునే రేంజ్‌కు ఎదిగాడు. తన పై పంచ్‌లు వేసినా… కామెంట్స్‌ విసిరినా.. లైట్‌గా తీసుకుని .. తన రిటర్న్ పంచులతో అందర్నీ నవ్విస్తుంటాడు. దీంతో బిగ్ బాస్ మేకర్స్ ఈ కమెడియన్‌పై ఫోకస్ పెట్టినట్టు ఉన్నారు. సెలబ్రిటీ కమెడియన్ కోటాలో.. హౌస్‌లోకి ఎంపిక్ చేశారు. అయితే ఇమ్మాన్యుయేల్ను హౌస్‌లోకి తీసుకొచ్చేందుకు షో మేకర్స్ కాస్త భారీగా బడ్జెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వారానికి రెండు లక్షల యాబై వేల చొప్పున ఎన్నొ వారాలు ఉంటే అన్ని వారాలు.. ఈ స్టార్ కమెడియన్‌కు రెమ్యునేషన్‌ను ఫిక్స్ చేసినట్టుగా ఇన్‌సైడ్ టాక్. ఇక బిగ్ బాస్ ఆఫర్ చేసిన ఈ ఢీల్ నచ్చడంతోనే.. అటు జబర్ద్ స్త్‌ .. మల్లెమాల బాండ్ బ్రేక్ చేసి మరీ ఇమ్మాన్యుయేల్ ఈ షోలోకి వచ్చినట్టు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ కంపు భరించలేకపోతున్నా.. విషం ఇచ్చి చంపేయండి! జడ్జికి మొరపెట్టుకున్న స్టార్ హీరో

Teja Sajja: ఆ పెద్ద దర్శకుడు.. నన్ను వాడుకొని వదిలేశాడు..

మల్లెపూలకే లచ్చ ఫైను.. ఎయిర్ పోర్టులో హీరోయిన్ కు వింత అనుభవం

TOP 9 ET: కాంబో ప్యాక్.. కాంతార టికెట్ కొంటే ప్రభాస్ మూవీ ట్రైలర్ ఫ్రీ | AA 22 నుంచి అనుకోని అప్‌డేట్

రూటు మార్చిన నాగ వంశీ.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో.. ఆంజనేయుడి యానిమేషన్ మూవీ