వీళ్లవి నోళ్లు కాదు మైకు సెట్లు.. రీతూ – ఆయేషా గొడవతో.. అందరికీ తలనొప్పి

Updated on: Oct 17, 2025 | 4:48 PM

బిగ్ సీజన్‌లో నిన్నటి అంటే 39వ ఎపిసోడ్‌లో రీతూ.. ఆయేశా మధ్య చిన్న పాటి వార్ నడిచింది. ఆ వార్‌లో వాళ్ల అరుపులు, కేకల ధాటికి హౌస్ మొత్తం దద్దరిల్లింది. చూస్తున్న ఆడియన్స్‌కూ కూడా ఓ దశలో చిర్రెత్తుకొచ్చింది. ఎందుకంటే ఆ గొడవ జరిగింది ఓ గిన్నె కడగడం గురించి. అయితే వీరి మధ్య గొడవ జరగడానికి అందరికీ కనిపించిన మరో కారణం కూడా ఉంది.

అదే ఆయేశా పవన్‌ తో డ్యాన్స్‌ చేయడం. ఈ గొడవ జరగడానికి కొద్ది సేపటి ముందు.. రీతూ చౌదరి దగ్గర డిమాన్ పవన్ కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. రీతూని ఉడికించాలని అయేషాతో పులిహోర కలిపాడు. గార్డెన్ ఏరియాలో అయేషాతో కలిసి డాన్స్ చేశాడు. అది కూడా ఓ రేంజ్ రొమాంటిక్ డాన్స్. దాంతో రీతూని ఏడిపిస్తూ ఇమ్మూ ఆటపట్టించాడు. ఆమెకు మరింత కోపం వచ్చేలా చేశాడు. కట్ చేస్తే… అర్థరాత్రి గార్డెన్‌ ఏరియాలో కూర్చున్న రీతూను కాస్త కూల్ చేసేందుకు డీమార్ ప్రయత్నించాడు. కానీ ఏమాత్రం కూల్ అవ్వని రీతూ… ఆతర్వాత రోజు ఉదయాన్నే.. గిన్నెలు కడగడానికి వెళ్లి… ఓ గిన్నెను చూపుతూ.. అది రాత్రి కడగాల్సిన తాను కడగనంటూ చెప్పింది. కెప్టెన్ కళ్యాణ్‌కు ఇదే విషయాన్ని వివరించింది. ఇదే విషయాన్ని కుకింగ్ ఇన్‌ఛార్జ్‌ దివ్యకి కూడా చెప్పింది. ఆతర్వాత మరో హౌస్‌మెట్ రీతూతో పాటు గిన్నెలు కడిగే డ్యూటీ చేస్తున్న అయేషా దగ్గరకు వెళ్లిన కళ్యాన్‌… రీతూ రాత్రి అన్ని గిన్నెలు కడిగింది.. కానీ ఎవరో మార్నింగ్ దోశ పిండి గిన్నె అక్కడ పెట్టారు.. అది నువ్వు క్లిన్ చేస్తావా.? అని అడిగాడు. బ్రేక్‌ఫాస్ట్ నుంచి లంచ్ వరకూ వాడిన గిన్నెలు మాత్రమే నావి.. తర్వాత రీతూ పని అని చెప్పింది అయేషా.. ఆ గిన్నె ను కడగను అని చెప్పింది. అలా వీరిద్దరి మధ్య రాజుకున్న రచ్చ కాస్త… హౌస్‌ను వణికించేసింది. ఇద్దరూ ఏమాత్రం తగ్గకుండా అంతేసి నోర్లతో అరుస్తుండడంతో… సంజన దెబ్బకు తల పట్టుకుంది. చేసేదేం లేక తనే సైలెంట్‌గా వెళ్లి ఆ గిన్నెను కడిగేసింది. అయితే ఈ ఎపిసోడ్‌లో రీతూ- ఆయేశా అరుపులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వీళ్లవి నోళ్లు కాదు మైకు సెట్లు అనే కామెంట్స్ వచ్చేలా చేసుకుంటున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mithra Mandali: చాలా కష్టపడి నవ్వాలి! హిట్టా..? ఫట్టా..?

ఏదేమైనా రచ్చ గెలవాల్సిందే .. దిల్ రాజు మాస్టర్ ప్లాన్

అది నా తప్పే.. జగ్గూభాయ్‌కి సారీ చెప్పిన కీర్తి

Published on: Oct 17, 2025 04:24 PM