కొడుకుకు రూ.40 లక్షలు.. అమ్మకు రూ.42 లక్షలు!..ఇద్దరికీ జాక్ పాట్
బిగ్ బాస్ 9లో ఇమ్ము తన కామెడీతో, ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. టాప్ 3లో ఉంటాడనుకున్నా టాప్ 4లో ఎలిమినేట్ అయ్యాడు. ఇమ్ముకి రూ.40 లక్షల రెమ్యునరేషన్ లభించింది. సంజన తన ఆటతో ప్రేక్షకులను గెలిచి, టాప్ 5లో వెనుతిరిగింది. ఆమెకు రూ.42 లక్షలకు పైగా లభించగా, ఈ సీజన్‌లో అత్యధిక పారితోషికం అందుకున్నది సంజనే. వారి నిష్క్రమణలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
ఇమ్మూ లేకపోతే ఈ సీజన్ 9 లేదు అనేట్టుగా తన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. అలాగే తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. విన్నర్ కాకపోయినా.. టాప్ 3లో ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ అసలు ఎవరూ అనుకోని విధంగా టాప్ 4లో ఎలిమినేట్ కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.ఇక ఇమ్ము రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ హౌస్‌లో 15 వారాలున్న ఈ ఎంటర్‌టైనర్‌కి.. వారానికి రూ. 2.6 లక్షల చొప్పున.. మొత్తంగా 40 లక్షల రూపాయలను రెమ్యునరేషన్‌గా అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ సీజన్‌లో భరణి, సంజనలు రెమ్యునరేషన్‌లో టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత తనూజ,ఇమ్ము ఆ లిస్టులో ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 9లో చాలా చప్పగా సాగుతుంది అనుకునే సమయంలో తన ఆటతో ఆడియన్స్ మనసులు గెలిచింది సంజన. ఇక అప్పటి నుంచి ఆడియన్స్ దృష్టిని తన వైపుకి తిప్పుకునే ఎదో ఒకటి చేస్తూనే వస్తుంది ఉంది. తన చిలిపి పనులతో నవ్వించించి కూడా. అవసరం ఉన్నచోట బలంగా మాట్లాడింది. తన వాదనను నిర్భయంగా చెప్పుకొచ్చింది. మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పడం అనేది జనాలకు బాగా నచ్చింది. అందుకే ఆమెను అంతలా సపోర్ట్ చేశారు. కానీ, టాప్ 5 నుంచి ఆమె వెనుతిరగాల్సి వచ్చింది. అయితే, ఈ సీజన్ లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అంటే సంజనదే అని తెలుస్తోంది. ఈమెకు వారానికి రూ.2.8 లక్షల చొప్పున బిగ్ బాస్ టీం ముట్టజెప్పిందట. అలా 15 వారాలకు గాను ఆమె ఏకంగా రూ.42 లక్షలకు పైగా రెమ్యునరేషన్ గా అందుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవన్ , NTR పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు! తప్పక పాటించాల్సిందే
కొడుకు హత్యకు తండ్రి సుపారీ… ఎందుకో తెలిసి పోలీసులే షాక్
తాజ్‌మహల్ కనిపించుట లేదు.. పొగమంచులో ఉత్తర భారతం
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. స్పర్శ దర్శనం సమయాలు
