ఉన్నది వారమే అయినా.. గట్టిగానే సంపాదించిన శ్రష్టి
బిగ్ బాస్ సీజన్ 9 మొదటి వారం పూర్తి చేసుకుంది. ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు.. ఇప్పుడు సీజన్ 9లోకి అడుగుపెట్టింది. ఆరుగురు సామాన్యులు, తొమ్మిది మంది సెలబ్రెటీలు అడుగుపెట్టారు. కాగా ఇప్పటికే మొదటి వారం ఎలిమినేషన్స్ కూడా పూర్తయ్యాయి. హౌస్ లోకి అడుగు పెట్టిన రోజు నుంచి హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.
మొదటివారం నామినేషన్స్‌లో శ్రష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్ ఉన్నారు. ఇక ఒకొక్కరిని సేవ్ చేసుకుంటూ కింగ్ నాగార్జున చివరిగా ఒకరిని ఎలిమినేట్ అయినట్టు అనౌన్స్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి వారం ఎలిమినేష్ జరిగిపోయింది. అందరూ అనుకున్నట్టే శ్రష్టి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు.. బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలాగే ఓటింగ్‌లోనూ ఈ చిన్నదానికి అంతా ఆదరణ దక్కలేదు. దాంతో మొదటివారమే శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కాగా శ్రష్ఠి వర్మ రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ ఇంత తొందరగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తుందని ప్రేక్షకులు అనుకోలేదు. హౌస్ లో ఈ అమ్మడు తన ఎనర్జీతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ హౌస్ లో ఆమె పెద్దగా ఆడింది ఏమీ లేదు. పెద్దగా యాక్టివ్ గా కూడా కనిపించలేదు. నామినేషన్స్ లో ఉన్న తర్వాత కూడా ఈ అమ్మడికి ఓటింగ్ పెద్దగా పడలేదు. దాంతో ఆమె మొదటి వారం హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. వారం రోజులు హౌస్ లో ఉన్నందుకు ఈ అమ్మడికి భారీగానే రెమ్యునరేషన్ అందిందని తెలుస్తుంది. వారం రోజులకుగాను శ్రష్ఠి వర్మ రూ. 2 లక్షలు అందుకుందని తెలుస్తుంది. ఇక బయటకు వస్తూ హౌస్ లో ఉన్నవారి పై బిగ్ బాంబ్ వేసింది. హౌస్ లో నిజాయితీగా ఉండేది ఎవరు అని అడగ్గా.. మనీశ్, హరీశ్, రాము రాథోడ్, ఆషా షైనీ అని శ్రష్టి తెలిపింది. అలాగే కెమెరా ముందు యాక్టింగ్ చేస్తుంది ఎవరు అని అడగ్గా..భరణి, రీతూ చౌదరి, తనూజ అని చెప్పింది శ్రష్టి .
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంపర్ ఆఫర్ ! ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ! ఏం ప్లాన్ గురూ..!
మిరాయ్ సినిమాలోరాముడిగా నటించిందెవరో తెలిసిపోయింది..
ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే! పాపం శ్రష్టి
