మరీ ఇంత తేడాగా ఉన్నారేంట్రా.. అగ్నిపరీక్ష మీకు కాదు.. చూసే మాకు

Updated on: Aug 19, 2025 | 4:50 PM

బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ తెలుగులోనూ అలరిస్తోంది. ఇప్పటికే ఈ రియాల్టీ గేమ్ షో తెలుగులో 8 సీజన్స్ ను పూర్తి చేసుకుని 9వ సీజన్లోకి అడుగుపెడుతోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 9ను చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు షో మేకర్స్.

ఈ సారి సామాన్యులకు అవకాశం ఇస్తూ అగ్నిపరీక్ష కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. నవదీప్, బిందు మాధవి, అభిజిత్.. ఈ ముగ్గరిని జడ్జెస్‌గా పెట్టి… టాస్కులు అండ్ ఇంటర్వ్యూ ద్వారా సామాన్యులను సెలక్ట్‌ చేసే బాధ్యత ఈ ముగ్గురిపై పెట్టారు. శ్రీముఖిని ఈ షోను హోస్ట్‌ చేస్తోంది. ఇక రీసెంట్‌గా అగ్నిపరీక్షకు సంబంధించిన ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమో కాస్తా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతూ అందర్నీ నవ్విస్తోంది. కామన్ మెన్ క్యాటగిరీ నుంచి వచ్చిన 15 మంది కంటెస్టెంట్లు గురించి జడ్జెస్‌ అగ్ని పరీక్షలో అడిగి తెలుసుకోవడంతో పాటు, కొన్ని టాస్క్ లు కూడా ఇచ్చి సెలక్ట్ చేస్తున్నట్టు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొంతమంది కంటెస్టెంట్స్‌ జడ్జెస్‌ దగ్గర అతి చేస్తున్నారు. కొందరు బ్రతిలాడుతుండగా.. ఇంకొందరు పొర్లు దండాలు పెడుతున్నారు. మరి కొందరేమో ఓవర్ యాటిట్యూడ్‌తో జడ్జెస్‌కు కోసం తెప్పిస్తున్నారు. చిన్న ప్రోమో కట్‌లోనే వారి వేషాలతో ఇప్పుడు టాక్‌ ఆఫ్ సోషల్ మీడియా అయిపోయారు. మరీ ఇంత తేడాగా ఉన్నారేంట్రా…అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. అగ్నిపరీక్ష మీకు కాదు.. చూసే మాకు…! అనే మీమ్‌తో ఇప్పుడీ కంటెస్టెంట్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నారు. అయితే ఈ అగ్ని పరీక్షకు ఎవరెవరు సెలక్ట్ అయ్యారంటే… అనూష రత్నం – ఈమె ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, ప్రసన్న కుమార్ – ఈయన దివ్యాంగుడు, దమ్ము శ్రీజ – ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్, మిస్ తెలంగాణ కల్కి, డాలియా – జిమ్ కోచ్, దివ్య నిఖిత – ఈమె వెజ్ ఫ్రైడ్ మోమో ఫేమ్, శ్రియ – ఈ అగ్ని పరీక్షకు వచ్చినందరిలో చిన్న వయస్సు ఉన్న కంటెస్టెంట్, శ్వేతా శెట్టి – ఈమె యూకే బాడీబిల్డర్, పవన్ కళ్యాణ్ – ఆర్మీ , ప్రశాంత్- ఈయనో లాయర్, షాకిబ్ – ఈయనో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, డెమోన్ పవన్ – ఈయన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ ఈయనో బిజినెస్ మాన్. లాస్ట్ మాస్క్డ్ మ్యాన్ హృదయ్. వీళ్లందరూ ఫస్ట్ ఎపిసోడ్‌లో అగ్ని పరీక్షను ఎదుర్కొన్న వారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమికుడి కోసం ప్లాస్టిక్ పడవలో సముద్రం దాటొచ్చిన యువతి.. ఆ తర్వాత?

తన భర్త కోట వెంటే.. తిరిగిరాని లోకాలకు కోట భార్య రుక్మిణీ