చిక్‌ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్‌

|

Nov 23, 2024 | 8:34 AM

ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం పుష్ప 2 ఫీవర్ కొనసాగుతోంది. ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్ 5నే ఈసినిమా రిలీజ్‌ కానుంది. ఇక ఈ క్రమంలోనే ఇటీవల ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు బన్నీ. ఇప్పటికే ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ కాగా… ఇప్పుడు సెకండ్ పార్ట్ అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో బన్నీ తనయుడు అయాన్, కూతురు అర్హ సందడి చేశారు.

అలాగే ఇదే షోలో మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న ప్రేమను బయటపెట్టాడు బన్నీ. చిన్నప్పటి నుంచి తనకు చిరంజీవితో రిలేషన్ ఎలా ఉండేదో అందరికీ తెలుసని మాట్లాడడం మొదలుపెట్టిన బన్నీ.. చిరు అంటే చిన్నప్పటి నుంచి తనకు చాలా ఇష్టమంటూ ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత తాను ఆయనతో ఎలా ఉన్నానో అందరికీ తెలుసు కానీ.. 20 ఏళ్ల ముందు చిరంజీవితో తాను ఎలా ఉన్నానో ఎవరికీ తెలియదంటూ చెప్పాడు బన్నీ. అంతేకాదు చిన్నప్పటి నుంచి చిరంజీవిని చూస్తూ పెరిగానని.. అయితే ఒక హీరోగా కంటే ఒక వ్యక్తిగా తనకు అభిమానం అన్నారు బన్నీ. తన చిన్నప్పుడే తనను, తన తమ్ముడు శిరీష్‌ను ఫారిన్ తీసుకెళ్లిన మొదటి వ్యక్తి చిరంజీవే అంటూ గుర్తు చేసుకున్నాడు. ఆయన అనుకుంటే వాళ్ల కుటుంబంవరకే వెళ్లొచ్చని.. . కానీ మమ్మల్ని అందరినీ కూడా ఫారెన్ ట్రిప్‌కు తీసుకెళ్లారన్నాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ ఒక్క మంచి పని చాలు.. నీ సినిమా హిట్టుకొట్టకున్నా కొట్టినట్టే !!

తెలియకపోతే చెప్పాలి కానీ.. ఇదేంటి !! చరణ్‌ వివాదంపై మనోహర్ దాస్ కామెంట్స్

Renu Desai: రేణు ఇంట తీవ్ర విషాదం !! దుఃఖంలో అకీరా తల్లి

పెళ్లి కొడుకు రాలేదని.. ఆగిపోయిన రైలు