Balakrishna: రజినీని రికార్డ్‌ను బద్దలు కొట్టిన బాలయ్య

Updated on: May 15, 2025 | 12:43 PM

బాలయ్య ఇప్పుడు ఫుల్ జోష్‌ మీదున్నాడు. వరుసగా సినిమాలు చేయడమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌ వరద పారిస్తున్నాడు. తన స్టార్‌ డమ్‌ రేంజ్‌ ఏంటో.. తనకున్న ఫ్యాన్స్‌ బేస్ ఏంటో అందరికీ చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏకంగా సూపర్ స్టార్ రజినీ కాంత్ రికార్డ్‌నే బీట్ చేశారు మన లెజెండ్ బాలయ్య. అదీ రెమ్యునరేషన్‌ విషయంలో బీట్ చేసి ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతున్నాడు బాలయ్య.

సౌత్ ఇండియాలో రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకునే హీరోల్లో రజినీ కాంతే ముందుంటారు. పూర్తి సినిమాకే కాదు.. ఓ సినిమాలో గెస్ట్‌ అప్పియరెన్స్ ఇచ్చినా.. రజినీ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారు. తన కూతురు డైరెక్షన్లో తాను చేసిన లాల్ సలామ్‌ సినిమాలో అలా కనిపించినందుకే ఏకంగా 40 కోట్ల రూపాయలను పారితోషకంగా తీసుకున్నాడు. అయితే రజినీ క్రియేట్ చేసిన ఈ రెమ్యునరేషన్ రికార్డ్‌ను ఇప్పుడు బాలయ్య క్రాస్ చేశాడు. రజినీ, నెల్సన్ కాంబోలో తెరకెక్కే జైలర్ 2 సినిమాలో.. గెస్ట్ రోల్ చేస్తున్న బాలయ్య.. ఆ రోల్ కోసం ఏకంగా 50 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా అందుకుంటున్నట్టు టాక్. దీంతో ఇప్పుడు బాలయ్య నేమ్‌ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోగిపోతోంది. దాంతో పాటే బాలయ్య అభిమానులను మీసం మెలేసి.. తొడకొట్టేలా చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సొంత తండ్రి నుంచే దారుణ వేధింపులు.. ఏడుస్తూ చెప్పిన హీరోయిన్