Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
అన్‌స్టాపబుల్ సీజన్ 4 స్టార్ట్ అయింది. బాలయ్య ఓటీటీ ఫీల్డ్లో మరో సారి హాట్ టాపిక్ అవడం షురూ అయింది. ఫస్ట్ ఎపిసోడ్‌లో తన బావ, ఏపీ సీఎం చంద్రబాబుతో అన్‌స్టాపబుల్ షో బిగిన్ చేసిన బాలయ్య.. ఆ తర్వాత సూర్య అండ్ కంగువ టీంతో రెండో ఎపిసోడ్ ఫినిష్ చేశాడు. ఇక ఇప్పుడు డబ్బు చేసే మ్యాజిక్ గురించి దిమ్మతిరిగే రేంజ్లో చెప్పిన లక్కీ భాస్కర్‌తో మూడో షో చేశారు బాలయ్య.
ఎస్ ! లక్కీ భాస్కర్ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, ప్రొడ్యూసర్ నాగ్ వంశీ లు బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 లో సందడి చేశారు. అక్టోబర్ 31న దీపావళి కానుకగా రిలీజ్ అయ్యే.. తమ సినిమా విశేషాలతో పాటు.. ఎన్నో కబుర్లను బాలయ్యకు చెప్పారు. ఇక బాలయ్య కూడా.. తన స్టైల్లో దుల్కర్ సల్మాన్ పై జోకులు పేల్చారు. తికమక పెట్టే ప్రశ్నలు అడుగుతూ.. ఫన్నీ పంచ్‌లు పేల్చారు. ఇంకో మాటలో చెప్పాలంటే.. తన ప్రశ్నలతో.. పంచ్‌లతో.. దుల్కర్ నోటి నుంచి జై బాలయ్య అనే స్లోగన్ వచ్చేలా చేసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన్ ప్రోమో ఇప్పటికే యూట్యూబ్‌లోను.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలోనూ మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. దీపావళికి ఆహాలో స్ట్రీమ్ అయ్యే ఫుల్ ఎపిపోడ్ కోసం.. అందర్నీ ఈగర్‌గా ఎదురు చూసేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.