Avatar 3: అవతార్ క్రేజ్ పెరిగిందా? తగ్గిందా?

Edited By:

Updated on: Dec 17, 2025 | 4:07 PM

అవతార్ మూడో చాప్టర్ "ఫైర్ అండ్ యాష్"పై క్రేజ్ ఉందా లేదా అనే చర్చ జరుగుతోంది. మొదటి భాగాన్ని మించేలా మూడో ఇన్స్టాల్‌మెంట్ ఉంటుందని జేమ్స్ కామెరూన్ చెబుతున్నారు. అయితే, రెండో భాగానికి మిశ్రమ స్పందన రావడంతో, మూడో భాగం వసూళ్లపై దాని ప్రభావం ఉంటుందా అనేది సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.

అవతార్‌ మూడో చాప్టర్‌కి క్రేజ్‌ ఉందా లేదా? పాండోరా లవర్స్ కి త్రీక్వెల్‌ మీద ఇంట్రస్ట్ తగ్గిందా? ఆ ప్రభావం వసూళ్ల మీద పడుతుందా? ఇప్పుడు ఇదో ఇంట్రస్టింగ్‌ చర్చ. క్రిస్మస్‌ వీకెండ్‌కి కాస్త ముందుగా వస్తున్న అవతార్‌ త్రీక్వెల్‌ గురించి సినీ వర్గాలు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నాయి. అవతార్‌ ఫైర్‌ అండ్‌ యాష్‌తో ప్రేక్షకులను పలకరించడానికి నేను రెడీ అంటున్నారు జేమ్స్ కామెరూన్‌. ఫస్ట్ పార్టును చూసి ఎగ్జయిట్‌ అయిన చాలా మందికి సెకండ్‌ పార్టు పెద్దగా నచ్చలేదు. దాంతో అందులో చేసిన తప్పులను దిద్దుకుని, ఫస్ట్ పార్టును మించేలా థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌ని తీర్చిదిద్దానన్నది జేమ్స్ కామరూన్‌ చెబుతున్న మాట. కచ్చితంగా మూడు గంటలా 17నిమిషాల రన్‌ టైమ్‌తో రిలీజ్‌ అవుతోంది థర్డ్ పార్ట్. ఫస్ట్, సెకండ్‌ పార్టుల్లో కనిపించిన విషయాలు థర్డ్ పార్టులో ఎక్కడా రిపీట్‌ కావన్నది కామరూన్‌ మాట. సెకండ్‌ పార్టుతో పోలిస్తే థర్డ్ పార్ట్ కంప్లీట్‌గా కొత్తగా ఉంటుందని అంటున్నారు. సెకండ్ పార్టుకి మన దగ్గర ప్రీ రిలీజ్‌ క్రేజ్‌ బాగానే ఉన్నా, పోస్ట్ రిలీజ్‌ మాత్రం ఫస్ట్ పార్టుకున్నంత క్రేజ్‌ లేదు. దాని ప్రభావం ఇప్పుడు అవతార్‌ త్రీక్వెల్‌ మీద పడిందన్నది ట్రేడ్ పండిట్స్ మాట. తినబోతూ రుచి గురించి మాట్లాడుకోవడం ఎందుకంటున్నారు పాండోరా గ్రహాన్ని ఇష్టపడేవారు. ఇయర్‌ ఎండింగ్‌లో ట్రీట్‌ గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది వారిలో. ఏమాత్రం ఎగ్జయిటింగ్‌గా అనిపించినా, ప్రపంచవ్యాప్తంగా వసూళ్లను కొల్లగొట్టడం గ్యారంటీ అనే నమ్మకం బాగానే ఉంది జనాల్లో. ఏమాత్రం బాగోలేకపోయినా, వసూళ్లు దారుణంగా పడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదన్నది క్రిటిక్స్ తరఫున వినిపిస్తున్న మాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మార్చి యుద్ధం.. 2 వారాల్లో 4 పాన్ ఇండియా సినిమాలు

హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

Vijayawada: బెజవాడ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌ దోపిడీ

డీమాన్‌ని ఢీ కొట్టి బొక్కబోర్లా పడ్డ కళ్యాణ్.. తనూజ దెబ్బకు షాక్‌లోకి

Pawan Kalyan: పవన్‌ డ్యాన్స్‌ ఎఫెక్ట్‌ షేక్ అవుతున్న సోషల్ మీడియా..