Anupama Parameswaran: సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
పుష్ప సినిమాలో ఉ అంటావా మావా... అంటూ స్పెషల్‌గా స్టెప్పులేశారు సమంత. అయితే ఇప్పటిదాకా తాను అలాంటి పాటలు చేయలేదని అన్నారు సామ్. ఈ సాంగ్‌ని కంప్లీట్ చేయగానే, తాను కూడా అల్ట్రా గ్లామరస్‌గా స్పెషల్ సాంగ్స్ చేయగలననే కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పారు. స్పెషల్ సాంగ్స్ చేయడం అంత ఈజీ కాదని కూడా అన్నారు ఈ బ్యూటీ.
సమంతను అనుపమ ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? ఇంతకీ మేటరేంటి? అని అంటారా?… డీటైల్డ్ గా చెప్పుకుందాం. పుష్ప సినిమాలో ఉ అంటావా మావా… అంటూ స్పెషల్‌గా స్టెప్పులేశారు సమంత. అయితే ఇప్పటిదాకా తాను అలాంటి పాటలు చేయలేదని అన్నారు సామ్. ఈ సాంగ్‌ని కంప్లీట్ చేయగానే, తాను కూడా అల్ట్రా గ్లామరస్‌గా స్పెషల్ సాంగ్స్ చేయగలననే కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పారు. స్పెషల్ సాంగ్స్ చేయడం అంత ఈజీ కాదని కూడా అన్నారు ఈ బ్యూటీ. తన విష్‌లిస్ట్ లో బిగ్ టికెట్‌కి టిక్ మార్క్ పెట్టేశానని హ్యాపీగా చెప్పారు. ఇప్పుడు సేమ్ ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు నటి అనుపమ పరమేశ్వరన్. ఆమె టిల్లు స్క్వయర్‌లో బోల్డ్ గా నటించారు. అయితే ఇలా చేసిన తర్వాత, స్క్రీన్ ముందు కూర్చుని చూస్తున్నప్పుడు కలర్‌ఫుల్‌గానే ఉంటుందని అంటున్నారు అనుపమ. సెట్స్ లో మాత్రం అనీజీగా ఉంటుందన్నది ఈ బ్యూటీ మాట. అలాంటి కాస్ట్యూమ్స్ ని అంత మందిలో క్యారీ చేయడం అంటే, మాటలు కాదంటున్నారు అనుపమ పరమేశ్వరన్.