Anirudh Ravichander: తెలుగులో విజయాలు లేవు... అయినా అనిరుధ్‌ వెంటే టాలీవుడ్‌ టాప్‌ హీరోలా..? ( వీడియో )
Anirudh Ravichander

Anirudh Ravichander: తెలుగులో విజయాలు లేవు… అయినా అనిరుధ్‌ వెంటే టాలీవుడ్‌ టాప్‌ హీరోలా..? ( వీడియో )

|

Jun 24, 2021 | 3:56 PM

ఇంట గెలిచేశాం.. ఇక రచ్చ గెలవటమే తరువాయి అని ఫిక్స్ అయిపోతున్నారు టాలీవుడ్‌ స్టార్స్‌. మన సినిమా అంటూ మడి కట్టుకు కూర్చున్న తమిళ సెలబ్రెటీలు మాత్రం షరామామూలుగానే పక్క చూపులు చూస్తున్నారు

ఇంట గెలిచేశాం.. ఇక రచ్చ గెలవటమే తరువాయి అని ఫిక్స్ అయిపోతున్నారు టాలీవుడ్‌ స్టార్స్‌. మన సినిమా అంటూ మడి కట్టుకు కూర్చున్న తమిళ సెలబ్రెటీలు మాత్రం షరామామూలుగానే పక్క చూపులు చూస్తున్నారు. రీసెంట్‌గా తమిళ హీరోలు స్ట్రయిట్ తెలుగు సినిమాల మీద కర్చీఫ్‌ వేస్తుంటే… ఇప్పుడు నా టర్న్ అంటున్నారు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచందర్‌. కోలీవుడ్‌లో టాప్ చైర్ అందుకున్నా… తెలుగులో మాత్రం హవా చూపించలేకపోతున్నారు మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌. పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు ఈ మ్యూజిక్‌ సెన్సేషన్‌. అయితే ఫస్ట్ సినిమానే డిజాస్టర్ కావటంతో అనిరుధ్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు. జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు చేసినా పెద్దగా క్రేజ్‌ రాలేదు. అందుకే ఈ సారి బిగ్ బ్యాంగ్‌తో రావాలని ప్లాన్ చేస్తున్నారు అనిరుధ్‌ .

YouTube video player

 

మరిన్ని ఇక్కడ చూడండి: Adilabad: ప్రసాదం ఇ‍వ్వడానికి వెళ్లిన బాలికపై స్వామీజీ అఘాయిత్యం… ( వీడియో )

వాక్సిన్ ఎఫక్ట్…?? అతడి శరీరం అయస్కాంతంలా మారిపోయింది.. ( వీడియో )

Published on: Jun 24, 2021 03:50 PM