వెండితెర మీద సందడి చేస్తున్న కార్టూన్ సినిమాలు
ఈ జనరేషన్‌కు పెద్దగా పరిచయం లేకపోయినా.. 90స్ కిడ్స్‌కు టీవీలో కార్టూన్ షోస్ చూడటం బాగా అలవాటు. కానీ నెమ్మది ఆ షోస్ తగ్గిపోయాయి. కానీ మరోసారి వెండితెర మీద భారీగా కార్టూన్ సినిమాలు సందడి చేస్తున్నాయి. ఏకంగా కమర్షియల్ స్టార్ హీరో సినిమా రేంజ్‌లో కలెక్షన్లు కూడా సాధిస్తున్నాయి. రీసెంట్ టైమ్స్‌లో కార్టూన్, యానిమేషన్ మూవీస్ మార్కెట్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన సినిమా మహావతార్ నరసింహా.
హోంబలే ఫిలింస్ సమర్పణలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ హిట్ అయ్యింది. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ యానిమేషన్ మూవీ 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అందుకే ఈ సిరీస్‌లో మరిన్ని కార్టూన్ మూవీస్‌ను సిద్ధం చేస్తోంది హోంబలే ఫిలింస్. తాజాగా మరో మైథలాజికల్ స్టోరీ యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహాభారత నేపథ్యంలో తెరకెక్కిన కురుక్షేత్ర సిరీస్ తొలి సీజన్ రిలీజ్ అయ్యింది. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ షో డిజిటల్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ఇండియన్ కాన్సెప్ట్స్‌కు మాత్రమే కాదు. హాలీవుడ్ యానిమే ప్రాజెక్ట్స్ కూడా ఇండియాలో కాసుల పంట పండిస్తున్నాయి. రీసెంట్‌గా డిమోన్ స్లేయర్ టీవీ సీరిస్ ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిన యానిమేషన్ మూవీ ఇండియాలో వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సక్సెస్‌లు చూసిన తరువాత మరిన్ని సినిమాలు ఇదే జానర్‌లో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదుగురికి పునర్జన్మనిచ్చిన జనసేన కార్యకర్త
జాలర్ల వలలో డూమ్స్ చేప.. ప్రకృతి విపత్తు తప్పదా
ఒక్క ఫోన్ కాల్‌తో ఆమె కోట్లకు పడగెత్తింది
