Anil Ravipudi: అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. యానిమేషన్ ప్రయోగం తర్వాత బాలయ్యతో మరో బ్లాక్‌బస్టర్?
వెంకటేష్–కళ్యాణ్‌రామ్ చిత్రంతో బిజీగా ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే తన తదుపరి ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తొలిసారిగా యానిమేషన్ చిత్రంతో ప్రయోగం చేయాలని భావిస్తుండగా, ఆ తర్వాత బాలకృష్ణతో మరో సినిమా చేయనున్నట్లు టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ ప్లానింగ్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
అనిల్ రావిపూడి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటి..? అప్పుడే అంత కంగారేంటి..? ఇంకా వెంకటేష్, కళ్యాణ్‌రామ్ సినిమా సెట్స్‌పైనే ఉంది కదా.. దాని తర్వాత వచ్చే ప్రాజెక్ట్ గురించే ఇప్పుడేనా చర్చ అనుకోవచ్చు. కానీ అనిల్ ఆలోచనలు ఎప్పుడూ ముందే ఉంటాయి. వెంకీ సినిమా చేస్తూనే.. మరో రెండు ప్రాజెక్ట్స్ సెట్ చేసారీయన. అందులో ఒకటి ప్రయోగం కూడా..! ఇంతకీ అనిల్ చేయబోయే ఆ ప్రయోగమేంటి..? వెంకటేష్, కళ్యాణ్ రామ్ సినిమా సెట్స్‌పై ఉండగానే.. అనిల్ రావిపూడి నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం చాలామంది నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఓ యానిమేషన్ సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు అనిల్. ఈ ప్రయోగంతో కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి.. తాను ఎలాంటి కథలైనా అద్భుతంగా డీల్ చేయగలనని నిరూపించుకోవాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. ఈ యానిమేషన్ సినిమా తర్వాత బాలకృష్ణతో మరోసారి వర్క్ చేయాలని చూస్తున్నారు అనిల్. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును కూడా తీసుకొచ్చింది. అనిల్ తన కెరీర్‌లోనే తొలిసారి బాలయ్యతో ఒక పవర్‌ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీసి ప్రేక్షకుల మన్ననలు పొందారు అనిల్. బాలయ్యతో చేయబోయే రెండో సినిమా కోసం అనిల్ రావిపూడి ఎలాంటి కథ సిద్ధం చేస్తారో అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైపోయింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ ప్లానింగ్ పీక్స్‌లో ఉందిప్పుడు. మొత్తానికి ఓవైపు మల్టీస్టారర్, మరోవైపు యానిమేషన్, ఇంకోవైపు బాలయ్య.. ఎలా చూసుకున్నా మరో మూడేళ్ల వరకు అనిల్ రావిపూడి డైరీ హౌజ్ ఫుల్ అన్నమాట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే
Health Benefits of Punarnava: ఈ ఆకు పచ్చడి చేసుకుని తింటే.. మోకాళ్ల నొప్పులు పరార్
ఆ ఊరే.. ఓ రంగస్థలం.. అక్కడ అందరూ పాత్రధారులే..!
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు డిస్కో లైట్ల బెడద.. ల్యాండింగ్ వేళ ముప్పుగా మారిన లేజర్ లైట్లు
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి