మనుషులకే దిక్కులేదంటే.. కుక్కకేమో గ్రాండ్‌గా బర్త్‌ డే పార్టీ…!

Updated on: Jul 10, 2025 | 8:49 PM

సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్‌ను ఫాలో అవడం.. వారి అప్ డేట్స్ తెలుసుకోవటం, వాటితో ఏదైనా కొత్తగా వింతగా అనిపిస్తే.. కామెంటో.. లేక ట్రోల్ చేయడం.. ! ఇలా సాగిపోతుంటుంది కొంత మంది నెటిజన్ల జీవితం.! అయితే టైమ్‌ పాస్ జీవితాన్ని వెళ్లదీస్తున్న కొంతమంది నెటిజన్లు.. ఇప్పుడు హీరోయిన్ ఆండ్రియా పెంపుడు కుక్కను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

పనిలో పనిగా కుక్కతో పాటు దాని యజమాని, హీరోయిన్‌ను వైరల్ చేస్తున్నారు. ఆండ్రియా జెర్మియా..! అటు సింగర్‌గా.. ఇటు హీరోయిన్‌ గా రాణిస్తున్న ఈ బ్యూటీ.. దాదాపు నాలుగేళ్ల నుంచి బీషాన్ ఫ్రీజీ జాతికి చెందిన డాగ్‌ను పెంచుకుంటున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్‌లోని వన్‌ ఆఫ్ ది కీ క్యారెక్టర్ అయిన జాన్ స్నో నేమ్‌ను.. తన పెట్‌ డాగ్‌కు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే తన పెంపుడు కుక్క బర్త్‌ డే వేడుకను ఒక పెట్‌ క్లబ్‌లో ఘనంగా నిర్వహించింది ఆండ్రియా..! తన ముద్దుల డాగ్‌‌కు ముచ్చటైన సూట్ కొట్టించి, దానికోసం ఓ పేద్ధ కేక్ తెప్పించి కట్ చేయించి,గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది ఈ అందాల భామ. అంతేకాదు ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది కూడా…! దీంతో ఈ బ్యూటీని ఫాలో అవుతున్న కొంతమంది నెటిజన్లు.. కుక్కకు కూడా ఈ రేంజ్‌లో బర్త్‌ డే చేయడంపై హీరోయిన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ‘ ఇవాళా రేపు.. మనుషులకే బర్త్ డే దిక్కులేదు గానీ..కుక్కకు మాత్రం గ్రాండ్ గా బర్త్‌ డే చేశావుగా..అది చాలా లక్కీ పెట్..’ అంటూ రకరకాల మీమ్స్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాలుగో పెళ్లాం వచ్చిన వేళా విశేషం.. లాటరీ గెలిచిన నటుడు…

మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. ఈసారి ఏకంగా.. !

‘అతను చనిపోవడమే బెటర్..’ ఉదయ్‌ చావుపై కౌషల్‌ షాకింగ్ కామెంట్స్

ఆలియాకు టోకరా వేసిన PA.. పోలీసులకు పట్టించిన హీరోయిన్

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న జురాసిక్ వరల్డ్ రీబర్త్‌