Samantha: సమంతకు షాకిచ్చిన అమెజాన్.. ఆ వెబ్ సిరీస్ సీక్వెల్ ఇక లేనట్లే..

Updated on: Apr 17, 2025 | 9:47 PM

అప్పుడప్పుడు మన లైఫ్‌.. మన కెరీర్‌, మనము ఊహించినట్టుగా సాగవు! సమంత విషయంలో ఎప్పటి నుంచో నిజమవుతున్న ఈ లైన్‌ ఇప్పుడు మరో సారి కూడా నిజమైంది. ఒక్క నిర్ణయం సమంత హాలీవుడ్ ఆశలను గల్లంతు చేసింది. ఎస్ ! అమెజాన్ ప్రైమ్‌ కోసం.. ఈమె ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన సిటాడెల్‌ సిరీస్‌కు.. సీక్వెల్ లేకుండానే ఆపేందుకు ప్రైమ్‌ టీం నిర్ణయం తీసకోవడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా లీడ్‌లో తెరకెక్కిన అమెరికన్ వెబ్ సిరీస్‌ సిటాడెల్. హాలీవుడ్‌ స్టార్‌ రిచర్డ్‌ మాడెన్‌, ప్రియాంక చోప్రా జంటగా నటించారు. న్యూటన్‌ థామస్‌- జెస్సికా ఇద్దరూ దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్‌కు ఇండియన్ వర్షన్‌గా… సిటాడెల్ హనీ బన్నీ సిరీస్‌ను తీసుకొచ్చింది ప్రైమ్‌. దీనికి రాజ్ అండ్ డీకే డైరెక్టర్స్ కాగా… సమంత అండ్ వరుణ్ దావన్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ప్రైమ్‌లో డీసెంట్‌ హిట్ టాక్ తెచ్చుకున్న ఈసిరీస్ కు సీక్వెల్ వస్తుందనే ఇన్నాళ్లు అనుకున్నారు సమంత అండ్ సమంత ఫ్యాన్స్‌ కూడా.. ! కానీ కట్ చేస్తే.. ఈ సిరీస్‌ సీక్వెల్‌కు సంబంధించి ఇప్పుడో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్ట అనౌన్స్‌ చేసింది ప్రైమ్‌ టీం.

తాజాగా దీనికి సీక్వెల్‌ నిలిపివేస్తున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రకటించింది. సిటాడెల్‌ ఇండియన్‌ వర్షన్‌తో పాటు ఇటాలియన్‌ వర్షన్‌ సిటాడెల్‌: డయానా సీక్వెల్స్‌ ఆపేసి, బదులుగా వీటిని ఒరిజినల్‌ సిరీస్‌లో విలీనం చేసినట్టు అఫీషియల్‌గా చెప్పింది. 2026లో రెండో సీజన్‌ను ముందుకు తీసుకొస్తాం అంటూ అనౌన్స్ చేసింది. దీంతో సమంతకు బిగ్ ఝలక్ తగిలినట్టైందనే కామెంట్ నెట్టింట వస్తోంది.