అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే వీడియో చూసేయాలిగా మరి

|

Dec 06, 2024 | 8:32 PM

కొన్ని సినిమాలను నడిపించడానికి కథతో అస్సలు పనిలేదు.. బ్రాండ్‌తోనే పని.. పుష్ప 2 విషయంలోనూ ఇదే జరిగింది. పుష్ప రాజ్ కారెక్టర్‌ను గంజాయిలా ఆడియన్స్‌కు ఎక్కించేసాడు సుకుమార్. గాంజా కొట్టడం తప్పే కానీ కిక్ ఇస్తుంది కదా.. అలాగే పుష్ప కారెక్టర్ కూడా. పుష్ప వేసే ప్రతీ అడుగు.. చేసే ప్రతీ పనీ తప్పే.. కానీ చూసే ఆడియన్‌కు అది రైటే.. అలా ఉంది సుకుమార్ రైటింగ్ ఈ సినిమాలో.

ప్రతీ 10-15 నిమిషాలకు ఓసారి హై ఇచ్చేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు లెక్కల మాస్టారు. కథ నెమ్మదిస్తున్న ప్రతీసారి అల్లు అర్జున్ డ్యూటీ ఎక్కేసాడు. కేవలం హై మూవెంట్స్ ఇవ్వడంపైనే ఫోకస్ చేసాడు సుక్కు.. ఎమోషన్స్ కూడా బాగానే వర్కవుట్ చేసాడు. యాక్షన్ సీక్వెన్సులు అయితే నెక్ట్స్ లెవల్. జాతర సీక్వెన్స్, క్లైమాక్స్ ఫైట్ పూనకాలు పుట్టించాడు. ఫస్టాఫ్ అంతా బన్నీ, ఫహాద్ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తుంది. సెకండాఫ్ ఎక్కువగా హై ఎమోషన్స్‌పై ఫోకస్ చేసాడు సుకుమార్. జాతరలో వచ్చే రష్మిక మందన్న ఎపిసోడ్‌లో సుక్కు రైటింగ్ చాలా బాగుంది. ఒక్కటైతే నిజం.. పుష్పలో ఉన్నంత కథ ఇందులో లేదు. హై ఇవ్వడమే పనిగా సీన్స్ రాసుకుంటూ వెళ్లిపోయాడు సుకుమార్. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. వీక్ సీన్స్‌ను కూడా తన రైటింగ్స్‌తో పీక్స్‌కు తీసుకెళ్లాడు సుకుమార్. అయితే అంతా బాగానే ఉన్నా.. ఒక్క మైనస్ మాత్రం అలాగే ఉండిపోయింది. సినిమాలో అల్లు అర్జున్ కారెక్టర్ తప్ప అందరూ డమ్మీనే. బన్నీ కోసం మిగిలిన కారెక్టర్స్‌ను తక్కువ చేసారేమో అనిపించింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫహాద్ ఫాజిల్ పాత్రను చాలా నీరసంగా ముగించారు. క్లైమాక్స్ కూడా అసంపూర్తిగానే ముగించారు.. మూడో పార్ట్‌కు లీడ్ ఇచ్చినా ఫస్ట్ పార్ట్ ముగించినంత కిక్ ఇవ్వలేదు. ఫ్యాన్స్ అయితే పూనకాలతో బయటికి వస్తారు.. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. మామూలు ఆడియన్స్‌కు కూడా పైసా వసూల్ సినిమా ఇచ్చాడు సుకుమార్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బయటపడ్డ సంగమేశ్వర ఆలయ గోపురం

మరికాసేపట్లో తాళి కడతాడనగా పెళ్లి మండపాన్ని ధ్వంసం చేసిన కుక్క

అంతరిక్ష వ్యర్థాలతో పెను ప్రమాదం

అపచారం అపచారం.. గర్భగుడిలో కేక్ కటింగా ??

ఐక్యూలో ఐన్‌స్టీన్‌ను మించిపోయాడు !! పదేళ్ల భారత సంతతి కుర్రాడు క్రిష్‌ అరోరా