Allu Arjun: గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..

Updated on: Nov 15, 2024 | 9:20 AM

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తయ్యాయి. ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు. బన్నీతో పాటు తల్లి నిర్మలమ్మ కూడా ఈ షోలో సందడి చేశారు. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా విశేషాలతో పాటే... తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్‌ విషయాలను పంచుకున్నాడు బన్నీ.

అన్ స్టాపబుల్ షోకు వచ్చే సెలబ్రిటీలను నవ్విస్తూనే.. కాస్త ఇరుకున పెట్టే ప్రశ్నలు అడిగే బాలయ్య.. బన్నీతో కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. గతంలో అల్లు అర్జున్ గోవాలో ఆల్కహాల్ కొన్నట్టు వైరల్ అయిన వీడియోలు, ఫొటోలను ఆయను చూపించారు. ‘ఎవరికోసం నువ్వే స్వయంగా వెళ్లి ఆల్కహాల్ కొన్నావు’ అని బన్నీని సూటిగా అడిగాడు బాలయ్య.

దీనికి బన్నీ.. ఒక స్పెషల్ పర్సన్ కోసం ప్రత్యేకంగా తానే వెళ్లి ఆల్కహాల్ బాటిల్ తెచ్చినట్టు బాలయ్య ప్రశ్నకు ఓపెన్ అయ్యాడు బన్నీ. అయితే ఆ స్పెషల్ పర్సన్ అన్నది మాత్రం ప్రోమోలో చూపించలేదు. మరి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే నవంబర్ 14 రాత్రి నుండి ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్‎స్టాపబుల్‌ విత్ NBK ఫుల్‌ ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక్కడ మరో విశేషం ఏంటంటే..! అల్లు అర్జున్ ఎవరి కోసమైతే స్వయంగా వైన్ షాపుకి ఆ ఆల్కహాల్ కొన్నారో ఆ వ్యక్తి కూడా ఈ షోలో సందడి చేయనున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అల్లు అర్జున్ అంతగా అభిమానించే ఆ స్పెషల్ పర్సన్ ఎవరబ్బా? అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్‌లో ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Nov 15, 2024 07:19 AM
Loading...
Unable to load recommendations.
Follow Us