ఢీ అంటే ఢీ !! కోర్టులో వాడీవేడిగా వాదనలు !! విచారణ వాయిదా
సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ వర్సెస్ పోలీసులు అన్నట్టుగా మారింది సీన్. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌కు వ్యతిరేకంగా పోలీసులు నాంపల్లి కోర్టు మెట్లెక్కడం అప్పట్లో హాట్ టాపిక్. తాజాగా న్యాయస్థానం ముందుకు వచ్చిన ఈ పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడింది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై ఇక అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్.. ఇటు అల్లు అర్జున్ తరుపు న్యాయవాది మధ్య నాంపల్లి కోర్టులో వాడీవేడీగా వాదన నడిచింది.
చివరకు.. విచారణను జనవరి 3కు కోర్టు వాయిదా వేసింది. రేవతి మృతికి అల్లు అర్జునే ప్రధాన కారణం అంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు PP. అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందంటూ వాదించారు. అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే తన పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టుకు వివరించారు. అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే పోలీస్ విచారణకు సహకరించరని.. అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ని కొట్టివేయాలని తన వాదనలు వినిపించారు పీపీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: