బోర్డు తిప్పేసి.. సరికొత్తగా జనాల్లోకి పచ్చళ్ల సిస్టర్స్

Updated on: Apr 20, 2025 | 6:27 PM

పచ్చళ్ల బిజినెస్‌తో కాదు.. ఆ పచ్చళ్ల రేట్‌ ఎంతని అడిగిన పాపానికి ఓ వక్తిపై బూతు వర్షం కురిపించిన అలేఖ్య చిట్టి .. తన బూతు పురాణంతో నెట్టింట ట్రెండ్ అయ్యారు. దారుణంగా ట్రోల్ కూడా అయ్యారు. ఏకంగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. తన అక్కను చెల్లిని రంగంలోకి దింపి.. సారీ చెప్పారు. ఇక ఈ క్రమంలోనే అలేఖ్య సిస్టర్ ఓ కొత్త వీడియోతో సోషల్ మీడియాలోకి వచ్చారు.

అలేఖ్య పికిల్స్ అనే బోర్డ్ తిప్పేసి.. సరికొత్తగా తమకలవాటైన పచ్చళ్ల బిజినెస్‌తోనే మళ్లీ జనాల్లోకి వస్తున్నట్టు ఓ వీడియో వదిలారు. అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరైన రమ్య కంచర్ల తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ మొత్తంగా క్లోజ్ అయిందని.. కానీ త్వరలోనే కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టు పేర్కొంది. తాము నెక్స్ట్ ఏం బిజినెస్ చేయబోతున్నామో తెలిపింది. 11 నెలల పాటు తమ అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ బాగా సాగిందని.. అయితే ఇటీవల జరిగిన పరిణామాల వల్ల 11 నెలలకే తమ బిజినెస్ ను మూసేశామని తెలిపింది. ఇక త్వరలోనే అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారాన్ని రమ్య మోక్ష పికిల్స్ పేరుతో కొత్తగా స్టార్ట్ చేస్తామని చెప్పింది. తమ కస్టమర్స్, బంధువులు, శ్రేయోభిలాషులు అందరూ మళ్లీ మేం గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకున్నామని.. అందుకే మరికొన్ని నెలలు సమయం పట్టినా ధైర్యంగా మళ్లీ మీ ముందుకు వస్తామని ఆమె చెప్పింది. అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలా చూసుకుంటామని చెప్పింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవుళ్లతో కామెడీలొద్దు.. ఇచ్చిపడేస్తారు…