హీరోయిన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌పై రిపోర్టర్ వెకిలి ప్రశ్న.. ఇచ్చిపడేసిన స్టార్

Updated on: May 24, 2025 | 2:43 PM

ఈ మధ్యకాలంలో సినిమా ప్రెస్ మీట్ లో రిపోర్టర్ ప్రశ్న లు అడగడం.. సినిమా టీమ్ సమాధానం చెప్పడం కామన్ అయిపోయింది. కొందరు వెకిలి ప్రశ్నలతో వైరల్ అవ్వడం కూడా కామన్ గా మారింది.. తాజాగా ఐశ్వర్య రఘుపతి పై ఓ రిపోర్టర్ వేసిన వెకిలి ప్రశ్న ఆమెను చాలా ఇబ్బందిపెట్టింది. హీరోయిన్ స్లీవ్‌లెస్‌ దుస్తులపై రిపోర్ట్ ప్రశ్న అడగడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.

తన లేటెస్ట్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఈమెను.. ఓ రిపోర్టర్ స్లీవ్‌లెస్ దుస్తులపై ప్రశ్న అడిగాడు.ఎండాకాలం వేడి ఎక్కువగా ఉంది కాబట్టే స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకున్నారా? అంటూ పిచ్చి ప్రశ్న వేశాడు . దానికి ఆమె చాలా హుందాగా ప్రవర్తించింది. ఈ ప్రశ్నకు, మా సినిమాకు, ఈ ఈవెంట్‌కు ఏం సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు అని ఆమె అన్నారు. ఆతర్వాత జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. ఆ ప్రశ్న నన్ను చాలా బాధపెట్టింది అని తెలిపింది. గాలి తగలడం కోసమే నేను స్లీవ్‌లెస్ వేసుకున్నానా అని ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నను నేను అర్ధం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. కోపంతో రియాక్ట్ అవ్వాలా లేక సైలెంట్ గా ఉండాలా అని నాకు అర్ధం కాలేదు. నేను సైలెంట్ గా ఉన్నా.. కానీ అక్కడున్నవాళ్లే స్పందించారు. అప్పుడు నేను సైలెంట్ గా ఉన్నా ఆతర్వాత అది నన్ను బాధపెట్టింది. కన్నీళ్లు కూడా పెట్టుకున్నా.. అని తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగులో ఛాన్సులు రావడంలేదుంటూ.. స్టేజ్‌పై ఏడ్చిన హీరోయిన్

మా హీరో,హీరోయిన్లకు సపరేట్‌ రూం ఇచ్చి డ్రగ్స్ ఇస్తున్నాం.. లేడీ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్

సబ్బు తెచ్చిన తంట.. చిక్కుల్లో తమన్నా! కన్నడ ప్రజలు సీరియస్

దీపిక బ్యాడ్‌లక్‌ కాస్తా.. రుక్మిణీ గుడ్‌లక్‌ అయిందిగా.. ప్రభాస్ పక్కన బంపర్ ఆఫర్

అమర జవాన్ కుంటుంబానికి ఆర్థిక సాయం.. చిన్న హీరోయిన్ పెద్ద మనసు !!