ఏడుపుగొట్టు సినిమా అంటూ కామెంట్.. దెబ్బకు హీరో వైరల్

Updated on: May 26, 2025 | 3:57 PM

చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అన్ని సినిమాలు సత్తా చాటుతున్నాయి. బడా హీరోల సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవుతూ ప్రపంచం మొత్తం మన సినిమాల వైపు చూసేలా చేస్తున్నాయి. అలాగే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంటున్నాయి.

అలా రీసెంట్‌గా రిలీజ్‌ అయి హిట్టైన సినిమానే అనగనగా..! థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ సినిమా గురించి తాజాగా అడవి శేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. రీసెంట్ గా హీరో సుమంత్ నటించిన అనగనగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ సక్సెస్ మీట్ జరిగింది. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన హీరో అడవి శేష్ …ఈ సినిమా గురించి కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. “నా ఫస్ట్ సినిమా ఈవెంట్‌కి సుమంత్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఇప్పుడు ఆయన సినిమా ఫంక్షన్‌కు నేను వచ్చాను..అనగనగా అనే సినిమా ఏడుపుగొట్టు సినిమా కాదు ఈ సినిమా ఒక లైఫ్ అని అన్నారు అడవి శేష్. ఈ సినిమా ప్రతిఒక్కరికి కనెక్ట్ అవుతుంది..కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి అని శేష్ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చడీచప్పుడు కాకుండా… విధ్వంసాన్ని మొదలెట్టిన చిరు

‘వెళ్లి నాన్న కాళ్లపై పడాలని ఉంది’ మంచు మనోజ్‌ ఎమోషనల్

ఉన్నట్టుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. నాని బిగ్ సర్‌ప్రైజ్‌

నేనూ అమ్మాయినే.. నాకూ పీరియడ్స్ వస్తాయి.. మరీ ఇంత బోల్డా

సినిమాల్లోకి, రాజకీయాల్లోకి రాకుంటే.. పవన్‌ ఏం అయ్యేవారో తెలుసా?