‘నీ స్వార్థం వల్ల అమాయక ప్రజలు చనిపోతున్నారు’ కయాదు సంచలన ట్వీట్

Updated on: Sep 30, 2025 | 3:50 PM

విజయ్ దళపతి! ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, కోలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ స్టార్‌గా నామ్ కమాయించిన ఈయన.. ఇప్పుడు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. తమిళగ వెట్రి కళగం TVK పార్టీతో తమిళనాడు రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రచారం మొదలెట్టారు.

అయితే ఆ సభలే ఇప్పుడు తన ఫ్యాన్స్‌కు ప్రాణాంతకంగా మారాయి. రీసెంట్‌గా విజయ్‌ నిర్వహించిన కరూర్‌ మీటింగ్‌లో.. తొక్కిసలాట జరిగి దాదాపు 39 మంది మరణించడం సంచలనంగా మారింది. అందర్నీ షాకయ్యేలా చేసింది. ఈ క్రమంలోనే ఈ విషాద ఘటనపై డ్రాగన్ హీరోయిన్ కయాదు లోహర్ పేరుతో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ ద్వారా.. ఆమె టీవీకే పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. కరూర్ లో జరిగిన ఈ దుర్ఘటనలో తనకు అత్యంత సన్నిహితులైన వారిని కోల్పోయానని.. ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నా సానుభూతి అంటూ కయాదు లోహర్ పేరుతో ఓ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఆ ట్వీట్లో టీవీకే పార్టీపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం టీవీకే స్వార్థ రాజకీయాలేనని రాసింది. మీ స్టార్డమ్ కు ప్రజలు ఆసరా కాదు.. మీ ఆకలికి ఇంకా ఎన్ని జీవితాలు నాశనం కావాలి అంటూ కాయదు లోహర్ పేరుతో ఉన్న ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ ట్వీట్ కయాదు నుంచి రాలేదని.. ఆమె పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్ నుంచి వచ్చినట్టు ఆమె ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో క్లారిటీ ఇస్తున్నారు. కానీ కయాదు మాత్రం ఈ విషయం పై.. తన పేరుతో వైరల్ అవుతున్న ట్వీట్‌ పై రియాక్టవ్వడం లేదు. దీంతో ఈ ట్వీట్ ఆమెది కాకపోయినా.. అందులోని రాతతో.. ఆమె ఏకీభవిస్తున్నారు కావచ్చనే కామెంట్ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్ల నుంచి వస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ది బెస్ట్ క్రైమ్‌ థిల్లర్! కోలీవుడ్‌లో ఇలాంటి సినిమా ఉందంటే నమ్మలేరు

అకీరా కాదు..ఆదిత్య ! సోషల్ మీడియా దుమ్ముదులుపుతున్న OG కుర్రాడు

ఈ కథలు చిన్నతనంలో విన్నానన్న NTR

విజయవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు