Ester Noronha: ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న అది చెయ్యాల్సిందే.. బోల్డ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.

|

Jul 14, 2024 | 2:02 PM

సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్లో క్యాస్టింగ్ కౌచ్ ఒకటి. దీని పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది తమను లైంగికంగా వేధించారు అంటూ కొంతమంది ముద్దుగుమ్మలు మీడియా ముందుకొచ్చి ధైర్యంగా చెప్పారు. ఇంకొంతమంది సోషల్ మీడియా వేదికగా తాము ఎదురుకొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. మరికొంతమంది క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై పోరాటం చేస్తున్నారు..

సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్లో క్యాస్టింగ్ కౌచ్ ఒకటి. దీని పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది తమను లైంగికంగా వేధించారు అంటూ కొంతమంది ముద్దుగుమ్మలు మీడియా ముందుకొచ్చి ధైర్యంగా చెప్పారు. ఇంకొంతమంది సోషల్ మీడియా వేదికగా తాము ఎదురుకొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. మరికొంతమంది క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై పోరాటం చేస్తున్నారు.. ఇంకొంత మందైతే.. అలాంటి అనుభవాలను తాము ఎదుర్కోలేదంటూ చెబుతున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా హీరోయిన్ ఎస్తర్ క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఎదగాలంటే షార్ట్ కట్ ఇదే అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.

సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి దేనికైనా సిద్ధమైతే కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్నారు ఎస్తర్ నోరాన్హా. సినీ ఇండస్ట్రీలో త్వరగా ఎదగాలి స్టార్ డమ్ రావాలి అని అనుకునేవారికి అదే షార్ట్ కట్ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు ఎక్కువగా జరగడానికి కారణం ఇక్కడ ఉన్న పరిస్థితులే అని ఆమె చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. అవకాశాల కోసం ఏదైనా చేస్తాను.. ఎంత దూరమైన వెళ్తానని అనుకునేవారు కూడా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారన్నారు. అలాంటి వారిని కొంతమంది లోబరుచుకుంటారని.. ఎస్తర్ బోల్డ్ కామెంట్ చేశారు. అవకాశాల అడ్వాంటేజ్ తీసుకునే ఇవన్నీ లైట్ తీసుకుని ..కెరీర్లో ఎదుగుతారన్నారు. కానీ తాను అలాంటివి ఎప్పుడూ చేయలేదంటూ చెప్పుకొచ్చారు. చాలా మంది టాలెంట్ ను నమ్ముకొని ముందుకు వెళ్తున్నారని.. తాను కూడా అలానే తన టాలెంట్ ను, హార్డ్ వర్క్ ను నమ్ముకుంటున్నా అన్నారు ఈమె.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Jul 14, 2024 02:02 PM