Prakash Raj: బన్నీ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ కామెంట్స్.!
‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అంతుకు ముందు అంటే డిసెంబర్ 4న చాలా చోట్ల సినిమా ప్రీమియర్ షోలు వేశారు. వీటి ద్వారాన సినిమాకు కోట్లాది రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అలాగే అడ్వాన్స్ బుకింగ్ లోనూ పుష్ప 2 దుమ్ము రేపింది. దీంతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ లెక్కలు కలుపుకుని మొదటి రోజే రూ. 294 కోట్లు రాబట్టింది పుష్ప. భారతీయ సినిమా చరిత్రలో ఒక సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే మొదటిసారి.
పుష్ప2 సినిమాకు అన్ని వైపులా నుంచి మంచి అప్లాజ్స్ వస్తున్నాయి. ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్ పుష్ప2 ను మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే వర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ కూడా ఓ ట్వీట్ వదిలారు. పుష్ప2కు తన స్టైల్లో రివ్యూ ఇస్తూ.. అల్లు అర్జున్‌ను ఆకాశానికి వెత్తేశాడు. గంగోత్రి నుండి అల్లు అర్జున్ ప్రయాణాన్ని చూస్తున్నా అంటూ ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్.. ఒక శిల్పాన్ని చెక్కినట్లు ఉండే, తన జర్నీ ఎంతో గొప్పదంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. బన్నీని చూసి గర్వపడుతున్నానని.. తను ఎప్పుడు ఇలాగే.. నటనతో సరిహద్దులు చెరిపేస్తూ ఉండాలి అల్లు అర్జుర్‌ను మెచ్చుకున్నాడు ప్రకాశ్ రాజ్. అంతేకాదు పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కు కూడా ప్రకాశ్ రాజ్ అభినందనలు తెలిపాడు. ఇప్పుడు తను చేసిన ఈ ట్వీట్‌తో నెట్టింట మరో సారి వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ యాక్టర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.