Aamir Khan: ఫ్లాపులతో సతమతమవుతున్న అమీర్ ఖాన్‌కు అట్లీనే దిక్కా? భారీ కాంబోపై ఆసక్తికర టాక్!
వరుస పరాజయాలతో కెరీర్‌లో కాస్త వెనుకబడిన బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇప్పుడు భారీ కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘జవాన్’ దర్శకుడు అట్లీతో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అట్లీ చెప్పిన కథాంశం అమీర్‌కు నచ్చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్‌తో ‘రాకా’ తెరకెక్కిస్తున్నందున, ఆ సినిమా పూర్తయ్యాకే అమీర్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఇప్పుడు టఫ్ టైమ్‌ను ఫేస్ చేస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ ఈ బాలీవుడ్ స్టార్ కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి. ప్రయోగాత్మక చిత్రాలు ఫెయిల్ అవ్వటంతో ఇప్పుడు పక్కా కమర్షియల్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆమిర్. అందుకే మిగత బాలీవుడ్ స్టార్స్ లాగే ఆమిర్ కూడా సక్సెస్ కోసం సౌత్ డైరెక్టర్ల వైపు చూస్తున్నారు. ఇంతకీ అమీర్‌ను గట్టెక్కించే ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి. ఒకప్పుడు దంగల్, పీకే, త్రీ ఇడియట్స్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ తో బాలీవుడ్‌ను ఏలిన హీరో అమీర్ ఖాన్. తన సినిమాలతో వందల కోట్లు కొల్లగొట్టడంతో పాటు, అద్భుతమైన నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు ఈ స్టార్. కానీ ఆ తరువాత వచ్చిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, లాల్ సింగ్ చడ్డా లాంటి ఫ్లాప్స్ అమీర్ కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వరుస ఫ్లాప్‌లతో కెరీర్ గాడి తప్పడంతో, ఈసారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు అమీర్. ప్రజెంట్ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని, ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే షారుఖ్ ఖాన్‌కు జవాన్ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ అట్లీతో అమీర్ చర్చలు జరుగుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఉండే అమీర్ ఖాన్, అట్లీ చెప్పిన లైన్‌కు ఇంప్రెస్ అయ్యారట. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదు. ప్రజెంట్ అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రాకా సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాతే అమీర్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తారు. ఏదేమైనా ఈ కాంబినేషన్ సెట్ అయితే అమీర్ కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఆయన ఫ్యాన్స్. మరి అట్లీ అయినా అమీర్ ఖాన్‌కు కోరుకున్న హిట్ ఇస్తాడేమో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kajol: 34 ఏళ్ల తర్వాత కాజోల్ రూట్ మార్చేశారు.. ఇకపై అలాంటి పాత్రలే చేస్తానంటున్న స్టార్ హీరోయిన్!
Nani: ఆసక్తికరంగా నాని హీరోయిన్స్ సెలక్షన్
Shraddha Srinath: మూడు భాషల్లో హిట్లు.. అయినా అవకాశాలు కరువు! శ్రద్ధా శ్రీనాథ్ కెరీర్‌కు ఏమైంది?
Ritika Nayak: వరుస హిట్లతో టాలీవుడ్‌లో గోల్డెన్ హ్యాండ్‌గా మారిన యంగ్ బ్యూటీ.. ఎవరో తెలుసా?
Dhurandhar: థియేటర్లలో వేల కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ వరల్డ్ రికార్డ్! ‘ధురంధర్’ దుమ్మురేపుతోంది