AR Rahman: రెహమాన్‌కి మరో అరుదైన గౌరవం.. కెనడాలోని ఓవీధికి రెహమాన్‌ పేరు నామకరణం..

|

Sep 02, 2022 | 8:13 PM

ఏఆర్‌ రెహమాన్‌ పేరు తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండరని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. తన సంగీతంతో ప్రేక్షకులకు మంత్ర ముగ్ధుల్ని చేసే రెహమాన్‌కు దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.


ఏఆర్‌ రెహమాన్‌ పేరు తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండరని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. తన సంగీతంతో ప్రేక్షకులకు మంత్ర ముగ్ధుల్ని చేసే రెహమాన్‌కు దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆస్కార్‌ అవార్డుతో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలందించిన ఈ సంగీత మాంత్రికుడికి ఇండియన్స్‌ మాత్రమే కాకుండా విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. తమిళం నుంచి మొదలు ఇంగ్లిష్‌ వరకు అన్ని రకాల భాషల చిత్రాలకు సంగీతంతో పాటు తన గానాన్ని అందించిన రెహమాన్‌ను ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి.ఈ గౌరవం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. విదేశాల్లోనూ రెహమాన్‌కు విశేష గౌరవం ఉంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే కెనడా దేశంలోని వీధికి ఆయన పేరును నామకరణం చేయడం. కెనడా దేశంలోని మార్కమ్‌ అనే పట్టణంలో ఉన్న వీధికి రెహమాన్‌ పేరును పెట్టారు. ఇదిలా ఉంటే ఈ పట్టణ వీధికి రెహమాన్‌ పేరు పెట్టడం ఇదే తొలిసారి కాదు 2013లో ఓ వీధికి, తాజాగా మరో వీధికి రెహమాన్‌గా నామకరణం చేయడం విశేషం. ఒక భారతీయ వ్యక్తికి కెనడాలాంటి దేశంలో ఇంత గౌరవం దక్కడం నిజంగానే గొప్ప విషయం కదూ.! ఈ విషయమై ఏఆర్‌ రెహమాన్‌ స్పందించారు. వీధికి తన పేరు పెట్టడం పై సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. ఇలాంటి గౌరవం దక్కుతుందని జీవితంలో ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు. మార్కమ్‌ పట్టణ మేయర్‌ ఫ్రాంక్‌ స్కార్పిట్టితో పాటు, ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అపూర్వ శ్రీవాస్తవకు, కెనడా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కెనడా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. తనకు మద్ధతుగా నిలిచిన ప్రతీ భారతీయుడికి ధన్యవాదాలు తెలిపిన రెహమాన్‌.. వందల ఏళ్ల చరిత్ర ఉన్న సినీ సంద్రంలో తను ఒక చిన్న నీటి బొట్టునని రెహమాన్‌ అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

Published on: Sep 02, 2022 08:13 PM