రణబీర్ కపూర్ కంటే అంత గొప్పగా ఏం యాక్టింగ్ చేశావ్‌? నీకెలా నేషనల్ అవార్డ్‌ వచ్చింది?

Updated on: Aug 04, 2025 | 6:13 PM

71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ కారణంగా బాలీవుడ్‌లో నయా ఫ్యాన్ వార్ మొదలైంది. అది కాస్తా ఇప్పుడు షారుఖ్ వర్సెస్ రణ్బీర్ కపూర్ గా అక్రాస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓ పక్క షారుఖ్‌కు 33ఏళ్ల తర్వాత బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ రావడంతో ఎస్‌ఆర్కే ఫ్యాన్స్‌ సంబరాలు చేస్తుకుంటుండగా.. ఇంకో పక్క యానిమల్ సినిమాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసినా కూడా తమ హీరోకు అవార్డ్ రాకపోవడంపై ఆర్కే అభిమానులు ఫీలవుతున్నారు.

రణ్బీర్ కపూర్ హీరోగా తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా యానిమల్! పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ డూపర్ హిట్టైంది. 900కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించింది. అయితే ఈ సినిమాలో రణ్బీర్ ఇంటెన్సివ్‌ యాక్టింగ్‌కు…, ప్లే చేసిన షేడ్స్‌కు పక్కాగా నేషనల్ అవార్డ్ వస్తుందనే అందరూ అనుకున్నారు. ఈ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అయితే ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయం కూడా చెప్పాడు. కానీ కట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడు క్యాటగిరీలో రణ్బీర్ కపూర్ లేకపోవడం బీ టౌన్‌లో హాట్ టాపిక్ అయింది. రణ్‌బీర్ కపూర్ ఫ్యాన్స్‌ను నొప్పించింది. దీంతో రంగంలోకి దిగిన ఫ్యాన్స్.. షారుఖ్ ను ట్రోల్ చేస్తున్నారు. మా హీరో కంటే అంత గొప్పగా ఏం యాక్టింగ్ చేశావ్ అంటూ షారుఖ్‌ను ప్రశ్నిస్తున్నారు. నీకెలా నేషనల్ అవార్డ్ ఇచ్చారంటూ షాకింగ్ పోస్టులు పెడుతున్నారు. యానిమల్ మూవీ క్లిప్స్‌తో.. జవాన్ మూవీ క్లిప్స్‌ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: ఎవరికో చూపించాలనే సమంత ఇలా చేస్తోందా ??