ఆన్ లైన్ గేమింగ్ స్కామ్ పై CGST అధికారుల విచారణ

Updated on: Feb 09, 2026 | 7:27 PM

హైదరాబాద్‌లో రూ. 5000 కోట్ల ఆన్‌లైన్ గేమింగ్ జీఎస్టీ ఎగవేత కుంభకోణం గుట్టురట్టయింది. దుబాయ్ కేంద్రంగా నడిచిన ఈ స్కామ్‌లో షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు సీజీఎస్టీ అధికారులు గుర్తించారు. విగోఫిన్ డైరెక్టర్లతో పాటు పలువురిపై విచారణ జరుగుతోంది. రెండు గేమింగ్ వెబ్‌సైట్లు, షెల్ కంపెనీలు పన్నులు ఎగవేసి వేల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించినట్లు తేలింది.

హైదరాబాద్‌లో భారీ ఆన్‌లైన్ గేమింగ్ జీఎస్టీ ఎగవేత కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వేల కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడిన ఈ ముఠాపై సీజీఎస్టీ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా దుబాయ్ కేంద్రంగా పనిచేసిందని, డొల్ల కంపెనీల ద్వారా సుమారు రూ. 5000 కోట్లను మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా, విగోఫిన్ డైరెక్టర్లు ప్రభు కుమార్, రాజశేఖర్ రెడ్డిలపై సీజీఎస్టీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: ఫ్లాష్ మాన్ లా పైపైకి పెరుగుతున్న బంగారం,వెండి ధరలు

నైజాం డిస్ట్రిబ్యూషన్ వార్.. రేసులో ఆ నలుగురు

Sukumar: రంగస్థలంను టార్గెట్ చేస్తున్న లెక్కల మాస్టారు.. ఫ్యాన్స్‌కు పండగే

Trivikram Srinivas: పాపం గురూజీ.. ఆ ఇద్దరి మధ్యా నలిగిపోతున్నాడుగా

Ramayana: ఊహకందని రామాయణ.. ఆ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్

Loading...
Unable to load recommendations.
Follow Us