Plastic Bottles: ప్యాకేజ్డ్‌ వాటర్ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారా.. ఇక పిల్లలు పుట్టడం కష్టమేనట.!

| Edited By: Janardhan Veluru

Mar 16, 2024 | 4:59 PM

హోటెల్‌కెళ్లి టిఫిన్ చేస్తే వాటర్ బాటిల్.. పెళ్లికెళ్లి భోజనం చేస్తే వాటర్ బాటిల్.. బస్సులో కావచ్చు.. ట్రైన్లో కావచ్చు.. ట్రావెల్ చేస్తే వాటిర్ బాటిల్.. సెమినార్లో బాటిల్.. మీటింగ్‌లో వాటర్ బాటిల్.. ఎక్కడ చూసినా నీళ్లు తాగాలంటే బాటిల్ ఉండాల్సిందే.

హోటెల్‌కెళ్లి టిఫిన్ చేస్తే వాటర్ బాటిల్.. పెళ్లికెళ్లి భోజనం చేస్తే వాటర్ బాటిల్.. బస్సులో కావచ్చు.. ట్రైన్లో కావచ్చు.. ట్రావెల్ చేస్తే వాటిర్ బాటిల్.. సెమినార్లో బాటిల్.. మీటింగ్‌లో వాటర్ బాటిల్.. ఎక్కడ చూసినా నీళ్లు తాగాలంటే బాటిల్ ఉండాల్సిందే. పైపెచ్చు.. గ్లాసులో నీళ్లు తాగితే నామోషీ.. వాటర్ బాటిల్ సీల్ తీసి నీళ్లు తాగితే గొప్ప.. ఈ భావన ఆల్రెడీ మన మైండ్లలో సెటప్ అయిపోయింది. ఇప్పట్లో దాన్నుంచి బయటపడే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అందుకేనేమో… ప్రపంచ వ్యాప్తంగా కేవలం ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ బిజినెస్ సుమారు 21 లక్షల కోట్లకు చేరిపోయింది. అయితే కొద్ది రోజుల క్రితం కొలంబియా యూనివర్శిటీ, రట్‌గర్స్ యూనివర్శిటీలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో నివ్వెర పోయే వాస్తవాలు బయటపడ్డాయి.

ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లలో నీళ్లు తాగడం అంటే డబ్బిచ్చి రోగాలు కొని తెచ్చుకోవడమేనని తేల్చారు. ప్రతి లీటర్ నీటిలో సుమారు 2 లక్షల 40 వేల నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయని తేల్చారు. నిజానికి ఇవి గతంలో ఊహించిన వాటికన్నా సుమారు 10 నుంచి 100 రెట్లు ఎక్కువ. వీరి పరిశోధన అమెరికాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురితమైంది. నానో ప్లాస్టిక్స్ అంటే అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు. కంటికి ఏ మాత్రం కనిపించకుండా నీటిలో కరిగిపోయే ఈ నానో ప్లాస్టిక్ రేణువుల వల్ల తీవ్ర మైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. రక్తంలో సులువుగా కలిసిపోతాయి. మన అవయవాలను, రోగనిరోధక శక్తిని, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.

Published on: Mar 07, 2024 07:12 AM