ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారైనా వదిలిపెట్టం
ఆలయాల్లో తప్పులు జరిగితే ఎవరినీ ఉపేక్షించబోమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని, నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ద్రాక్షారామం ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ద్రాక్షారామంలోని ప్రముఖ భీమేశ్వరస్వామి ఆలయం కోనేరు ప్రాంగణంలో ప్రతిష్ఠించిన ప్రాచీన శివలింగాలలో ఒకదానిని ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్య హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని మంత్రి పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
న్యూ ఇయర్ ట్రిప్‌కి పూజా, మాళవిక, మౌని రాయ్
దేశ ప్రజలకు కేంద్రం భారీ శుభవార్త..జనవరి 1 నుంచి
