Delhi Weather : ఢిల్లీలో పట్టపగలే చిమ్మచీకట్లు.. హఠాత్తుగా మారిపోయిన వాతావరణం

|

Sep 23, 2023 | 1:48 PM

ఢిల్లీతో పాటు, నోయిడా, గురుగ్రామ్ పరిసర నగరాల్లో కూడా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. రోజంతా ఉరుములు, ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. IMD ప్రకారం, శనివారం ఉదయం ఢిల్లీలో తేమ స్థాయి 115 శాతంగా నమోదైంది. దేశ రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పట్టపగలే నగరమంతా చిమ్మచీకట్లు వ్యాపించాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దట్టమైన మేఘాలు ఆవరించడంతో మిట్ట మధ్యాహ్నమే చీకట్లు కమ్ముకున్నాయి. ఈదురుగాలులతో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చాలా చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కాగా కేరళ, తమిళనాడు, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడాలో పిడుగులు పడే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..