పేకమేడల్లా కూలుతున్న భవనాలు.. హస్తినలో డేంజర్ బెల్స్
ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందగా, 11 మందిని సురక్షితంగా రక్షించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. NDRF, ఢిల్లీ పోలీసులు, MCD, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. భవనంలో నాలుగు హాస్టళ్లు, కింద మెడికల్ షాప్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఢిల్లీ దడ పుట్టిస్తోంది. సిటీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాజధాని భవనాలు పేకమేడల్లా కూలుతున్నాయి. వరుస ఘటనలతో జనాలు వణికిపోతున్నారు. తాజాగా నగరంలో మరో భవనం కుప్పకూలడం ప్రజానీకాన్ని కలవరపెడుతోంది. ఢిల్లీలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నిబంధనలకు నీళ్లొదులుతూ నిర్మిస్తున్న భవనాలు శాపంగా మారుతున్నాయి. ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. లేటెస్ట్‌గా ఢిల్లీ సత్య నికేతన్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. భారీ శబ్దంతో భవనం నేలమట్టం కావడంతో.. ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు, చుట్టుపక్కల నివాసితులు బయటకు పరుగులు తీశారు. NDRF, ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ, ఢిల్లీ పోలీస్, MCD బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న మరో నివాస భవనాన్ని కూడా అధికారులు ఖాళీ చేయించారు. భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరణాల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటివరకు 11 మందిని రక్షించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ దుర్ఘటనపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తాతో ఫోన్లో మాట్లాడారు. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు సమీపంలోనే ఈ భవనం ఉంది. ఇందులో నాలుగు హాస్టళ్లు నడుస్తున్నాయి. కింద భాగంలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 20 మంది విద్యార్థులు అక్కడ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురిని సురక్షితంగా బయటకు తీసిన అధికారులు… మిగిలిన వారి కోసం శిథిలాలను తొలగిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ 7 రోజువారీ అలవాట్లు ఉంటే వెంటనే మానేయండి.. లేకపోతే మీ మెదడు షెడ్డుకే..!
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం.. ఆ కుటుంబం ఏం చేసిందో మీరే చూడండి!
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్.. ఏకంగా ఇంటి పైకప్పుపై మహీంద్రా స్కార్పియో
