ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. 50 మీటర్ల దూరంలో కూడా కనిపించని వాహనాలు

|

Dec 31, 2023 | 7:32 PM

ఉత్తరాది మంచుదుప్పట్లో ముడుచుకుపోయింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్ తదితర రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ పడిపోవడంతో పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తరాదిన మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఆ తర్వాతి నుంచి మంచు ప్రభావం క్రమంగా తగ్గుతుందని మంచు ప్రభావం ఉత్తరాది నుంచి నడిచే పలు రైళ్లు, విమానాలపై పడింది.

ఉత్తరాది మంచుదుప్పట్లో ముడుచుకుపోయింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్ తదితర రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ పడిపోవడంతో పలు విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తరాదిన మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఆ తర్వాతి నుంచి మంచు ప్రభావం క్రమంగా తగ్గుతుందని మంచు ప్రభావం ఉత్తరాది నుంచి నడిచే పలు రైళ్లు, విమానాలపై పడింది. కొన్ని రైళ్లు, విమాన సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ-హౌరా మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ సహా డజన్ల కొద్దీ రైళ్లు 10 నుంచి 12 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమాన సర్వీసుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించనంతగా పొగ మంచు కమ్మేసింది. చలి పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే అక్కడి వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అటు గాలి నాణ్యత కూడా పడిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

25 వేల మంది యాత్రికుల‌కు లాక‌ర్ సౌక‌ర్యం

కిచెన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ నుంచి వింత శబ్దాలు.. పక్కకు తీసి చూస్తే

నాంపల్లి ఎగ్జిబిషన్‌కు సర్వం సిద్ధం.. కొలువుతీరనున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 2,400 స్టాళ్లు

 

Follow us on