ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే మూగబోయాను.. కూచిపూడి నర్తకి దీపికా రెడ్డి
కూచిపూడి దిగ్గజం దీపికా రెడ్డికి పద్మశ్రీ పురస్కారం లభించింది. 5 దశాబ్దాలకు పైగా కూచిపూడి నృత్యానికి ఆమె చేసిన విశేష సేవలకు ఇది గుర్తింపు. తాత, తల్లి, భర్త ప్రోత్సాహంతో 55 ఏళ్లుగా ఈ ప్రయాణం సాగింది. వేల ప్రదర్శనలు, శిష్యులతో కళను విస్తరించారు. కూచిపూడి ఆరోగ్యం, కళా వారసత్వం గురించి ఆమె అభిప్రాయాలు ఆమె ప్రస్థానాన్ని వివరిస్తాయి.
కూచిపూడి నాట్య రంగంలో ఐదు దశాబ్దాలకుపైగా సేవలందించిన ప్రముఖ నర్తకి దీపికా రెడ్డిని పద్మశ్రీ అవార్డు వరించింది. పద్మశ్రీకి ఎంపికైనట్టు ఆదివారం . ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి ఫోన్ చేసి పద్మశ్రీ పురస్కారం వచ్చిందని చెప్పిన క్షణం.. తన జీవితంలో మరిచిపోలేని క్షణమని దీపికా రెడ్డి తెలిపారు. 55 ఏళ్ల కూచిపూడి ప్రయాణంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన క్షణమిదని భావోద్వేగానికి లోనయ్యారు. చిన్నప్పటి నుంచే తనకు క్లాసికల్ డాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని, తన తల్లి భరతనాట్యం కళాకారిణి కావడంతో ఆ వాతావరణంలోనే పెరిగానని గుర్తు చేసుకున్నారు. రవీంద్ర భారతి ప్రారంభోత్సవం రోజున తన తల్లి తొలి ప్రదర్శన ఇచ్చారని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రి అయిన తన తాతగారు నూకల రామచంద్రారెడ్డి గారి ప్రోత్సాహంతోనే కూచిపూడి నేర్చుకున్నానని చెప్పారు. తాతగారు,తల్లి, పెళ్లి తర్వాత భర్త ఇచ్చిన సహకారంతోనే కళాకారిణిగా తన ప్రయాణం ఇంతదూరం సాగిందన్నారు. ప్రస్తుతం తన కుమార్తె కూడా కూచిపూడి కళాకారిణిగా కొనసాగం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేల ప్రదర్శనలు ఇచ్చానని, వేలాది మంది శిష్యులను తయారు చేయగలిగానని తెలిపారు. కూచిపూడి నృత్యం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక పురస్కారాలు, కళారంగానికి సంబంధించిన బాధ్యతలు కూడా నిర్వర్తించినట్లు దీపికా రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నానమ్మను చూసేందుకు వచ్చి కానరాని లోకాలకు
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
కాశీ విశ్వనాధ్ ఆలయంలో రిపబ్లిక్ డే శోభ