క్రేజీగా.. కలర్‌ఫుల్‌గా ఉంది పాక్‌పై జ్యోతి మల్హోత్రా వర్ణన
గూఢచర్యం చేస్తూ అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ హైకమిషన్‌లో పనిచేసే డానిష్‌తో తాను నిత్యం టచ్‌లో ఉండేదాన్నని, పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలున్నట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల మీడియా సంస్థ ప్రచురించింది. 2023లో వీసా కోసం పాక్ హైకమిషన్‌కు వెళ్లిన సమయంలో తొలిసారి డానిష్ పరిచయం అయ్యాడని ఆమె తెలిపింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా జ్యోతి పాక్‌కు సమాచారం చేరవేసిందా? అవుననే అనుమానిస్తున్నారు. పాక్ సరిహద్దు రాష్ట్రాలను వైమానిక, క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు భారత ప్రభుత్వం బ్లాకౌట్లకు ఆదేశించింది. ఈ సమాచారం కూడా ఆమె డానిష్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తు బృందం ఆమె నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌ట్యాప్ స్వాధీనం చేసుకున్నాయి. ఆమెకున్న రెండు బ్యాంకు ఎకౌంట్లను కూడా పరిశీలిస్తున్నాయి. ఇక నేటితో జ్యోతి పోలీస్ కస్టడీ ముగుస్తుంది. ఆమెను హిస్సార్ కోర్టులో హాజరుపర్చనున్నారు.
తాజాగా జ్యోతి మల్హోత్రా డైరీ, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దానిలో ఆమె పాక్‌పై ఎంతో అభిమానం చూపించినట్లు అర్థమవుతోంది. అక్కడి ప్రజల నుంచి విపరీతమైన ప్రేమ దొరికినట్లు చెప్పుకొచ్చింది. ఆ దేశం క్రేజీగా, కలర్‌ఫుల్‌గా ఉన్నట్లు వివరించింది. పాక్ హైకమిషన్ కార్యాలయానికి వీసా కోసం వచ్చే వారిని ట్రాక్ చేసి వారిని అక్కడి ఉద్యోగి డానిష్ గూఢచర్యానికి వాడుకొనేవాడు. ఎలాగైతే యూట్యూబర్ జ్యోతిని గూఢచర్యం ముగ్గులోకి దింపాడో అలాగే పంజాబ్‌కు చెందిన చెందిన గజాల అనే యువతిని కూడా హనీట్రాప్‌లోకి లాగాడు. ఆమె తన కుటుంబసభ్యుల వీసాల కోసం ఫిబ్రవరి 2వ తేదీన పాక్ హైకమిషన్‌కు వెళ్లింది. ఆ మర్నాడు వారి వీసాలు ఎప్పుడు వస్తాయో తెలుసుకునేందుకు గజాలా హైకమిషన్‌కు వెళ్లింది. నాడు గజాలా వీసా మినహా అందరివి ఓకే అయినట్లు తెలిపారు. అదే నెల 27వ తేదీన హైకమిషన్‌లో వీసా ఆఫీసర్ అంటూ డానిష్ నుంచి గజాలకు మెసేజ్ వచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: