CM Revanth Reddy: ‘ఈ తరానికి వైఎస్ ఒక్కరే, కేవీపీ ఒక్కరే’

Updated on: Sep 02, 2025 | 10:08 PM

వైఎస్‌ఆర్ వర్థంతి సందర్భంగా.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మెమోరియల్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చుట్టూ కుర్చీ లాగేసేవాళ్లే ఉన్నారు. నిజాయితీ పరులు ఎవరూ లేరన్నారు. వైఎస్‌ఆర్ వెంట కేవీపీ ఉన్నట్టు.. ఇప్పుడు ఎవరూ లేరన్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి,  డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్,  కేవీపీ లాంటి వ్యక్తులు ఈ తరానికి అరుదు అని అన్నారు. కేవీపీ లాంటి వ్యక్తి కావడానికి సర్వం త్యాగం చేయాల్సి ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, తనకు అనేక మంది కలుస్తున్నారని, వారితో చనువుగా మాట్లాడేటప్పుడు కేవీపీ గారిని గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావులను అసాధారణ వ్యక్తులుగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి.