Kannappa OTT: ఎట్టకేలకు OTTలోకి కన్నప్ప మూవీ..! విష్ణు తెలివే వేరబ్బా..
పట్టు వదలని విక్రమార్కుడిలా.. కొన్ని సంవత్సరాలు కష్టపడి మరీ కన్నప్ప సినిమాను తెరకెక్కించాడు మంచు విష్ణు. తెరకెక్కించడమే కాదు.. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేశాడు. మంచి టాక్ తెచ్చుకున్నాడు. అయితే థియేటర్లో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. ఇదే విషయమై మంచు విష్ణు నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చింది.
కన్నప్ప సినిమా రిలీజ్‌కు ముందు ఈ సినిమా ఓటీటీ డీల్ ఇంకా ఫిక్స్ కాలేదని స్వయంగా విష్ణునే చెప్పారు. తన సినిమాను ఓటీటీ సంస్థలు తక్కువకు అడుగుతుండడంతో.. రిలీజ్ అయి హిట్టైన తర్వాతే కన్నప్ప సినిమాను ఓటీటీ సంస్థలకు బేరం పెడతానంటూ చెప్పాడు. అయితే విష్ణు చెప్పినట్టే కన్నప్ప ఓటీటీ డీల్ కుదిరింది. అమెజాన్ ప్రైమ్ కన్నప్ప సినిమాను మంచి ఫ్యాన్సీ రేట్‌కు ఈ సినిమాను కొనుగోలు చేసినట్టు తెలస్తోంది. దీంతో ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఈనెల నాలుగో తేదీ నుంచి కన్నప్ప మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు హీరో మంచు విష్ణు నుంచి సోషల్ మీడియాలో అఫీషియల్ పోస్ట్ బయటికి వచ్చింది.
Follow Us
వైరల్ వీడియోలు
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

