Hyderabad: హైదరాబాద్‌లో క్లౌడ్‌బరస్ట్.. 5 గంటల కుంభవృష్టికి విలవిల్లాడిన ప్రజలు
ఆకాశం బద్ధలైందా.. మేఘాల గేట్లు తెరుచుకున్నాయా.. అన్నట్టుగా హైదరాబాద్‌పై విరుచుకుపడింది వర్షం. నిన్న సాయంత్రం ఆరున్నర నుంచి అర్థరాత్రి వరకు ఐదారు గంటలపాటు భాగ్యనగరాన్ని అల్లాడించాడు వరుణుడు. ఆ వర్షబీభత్సం నుంచి ఇంకా కోలుకోలేదు పలు కాలనీలు. ఇప్పటికీ జలదిగ్బంధంలోనే చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి.
క్లౌడ్‌బరస్ట్‌తో హైదరాబాద్ వణికిపోయింది. నిన్న కురిసిన కుండపోత వర్షానికి భాగ్యనగరం షేక్ అయ్యింది. బుధవారం రాత్రి జలవిలయం నుంచి నగరం తేరుకున్నప్పటికీ.. ఇంకా చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే మగ్గుతున్నాయి. బేగంపేట్ ప్యాట్నీనగర్‌లో ఏకంగా ఎనిమిది అడుగుల మేర వరద నీరు ప్రవహించిందంటున్నారు స్థానికులు. ఇప్పటికీ వరద నీటిలోనే ఉంది ప్యాట్నీనగర్. కుండపోత వానకు ఎస్‌ఆర్‌నగర్‌లో భారీ వృక్షం భవనంపై కుప్పకూలింది. ఆ చెట్టును DRF సిబ్బంది తొలగించారు. దోమలగూడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దోమలగూడలో చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు.
Published on: Sep 18, 2025 01:47 PM