చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా నాలుగు గ్రంథాల ఆవిష్కరణ

Updated on: Nov 10, 2026 | 1:28 PM

ముచ్చింతల్‌లో శ్రీ చిన్న జీయర్‌ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా నాలుగు ఆధ్యాత్మిక గ్రంథాలను ఆవిష్కరించారు. జీవా వైదిక సంశోధన ప్రకాశన విభాగం ఆధ్వర్యంలో డాక్టర్‌ సముద్రాల రంగరామానుజాచార్య రచించిన పుస్తకాలను స్వామీజీ విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలే సమాజానికి, ధర్మానికి నిజమైన రక్షకులని పేర్కొన్నారు. ప్రామాణికమైన పండితుల ద్వారా శాస్త్రీయ గ్రంథాల సారాన్ని తెలుసుకోవాలని సూచించారు.

రంగారెడ్డి జిల్లా, ముచ్చింతల్: యతీంద్ర సప్తతి వేడుకల్లో భాగంగా శ్రీ చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల మూడో రోజు గ్రంథావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జీవా వైదిక సంశోధన ప్రకాశన విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ సముద్రాల రంగరామానుజాచార్య రచించిన ‘దర్శన సంస్కృతం’, ‘రామానుజ దర్శనం’, ‘రామానుజ ఆన్ భక్తి’, ‘రామానుజ, ఏకవిజ్ఞాని’ గ్రంథాలను చిన్న జీయర్ స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. వ్యక్తుల కంటే గ్రంథాలే సమాజానికి, ధర్మానికి నిజమైన రక్షకులని అన్నారు. ప్రామాణికమైన పండితుల ద్వారా గ్రంథాల్లోని విషయాలను తెలుసుకోవాలని సూచించారు. శాస్త్రీయమైన, ప్రామాణికమైన గ్రంథాలను చదివి వాటి సారాన్ని అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.40 కోట్లు ఇస్తేనే ఉంటాం.. స్టార్ ప్లేయర్ల భారీ డిమాండ్

కాశీలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి పబ్లిక్‌ రోప్‌వే సిద్ధం

ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్

విమానయాన రంగంలో కొత్త శకం.. 90 ఏళ్ల నాటి చట్టం రద్దు

రాపిడో డ్రైవర్‌తో ప్రేమలో పడిన యువతి.. వైరల్ లవ్ స్టోరీ!

Published on: Nov 10, 2026 01:23 PM
Loading...
Unable to load recommendations.
Follow Us