ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు… తర్వాత ఏమైందంటే
ఏలూరు జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న సాయిచంద్, దుర్గా దంపతులకు కుల ఘర్షణలు అడ్డొచ్చాయి. గుడిలో పెళ్లి చేసుకున్న వీరిపై అమ్మాయి బంధువులు దాడి చేసి, సాయిచంద్‌ను కట్టేసి కొట్టి, దుర్గను కిడ్నాప్ చేశారు. ప్రస్తుతం సాయిచంద్ గాయాలతో చికిత్స పొందుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట దారుణ ఘటనకు గురైంది. కులాంతర వివాహం కారణంగా యువకుడిపై దాడి జరగగా, అతని భార్యను కిడ్నాప్ చేశారు. ముసునూరు మండలం రమణక్కపేటలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సాయిచంద్, దుర్గా అనే యువతీ యువకులు ప్రేమించుకొని, పెద్దల అంగీకారం లేకపోవడంతో ఏలూరు గంగమ్మ గూడలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. సాయిచంద్ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాగా, దుర్గా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన యువతి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
