మలాశయం ద్వారా ఆక్సిజన్.. జపనీస్ శాస్త్రవేత్తల కొత్త టెక్నిక్ !!
సృష్టిలోని ఏ జీవి అయినా ముక్కుద్వారా శ్వాస తీసుకుంటుందని మనందరికీ తెలుసు. కొన్ని జీవులు మలాశయం ద్వారా కూడా శ్వాస తీసుకుంటాయట. దీనిని ఆసరాగా చేసుకొని జపనీస్ శాస్త్రవేత్తలు ఓ కొత్త టెక్నిక్ కనిపెట్టారు. మానవులు కూడా ముక్కు నోటినుంచే కాకుండా మలాశయంద్వారా కూడా శ్వాసతీసుకోవచ్చని చెబుతున్నారు. బట్ బ్రీథింగ్ పేరుతో జపనీస్ శాస్త్రవేత్తలు ఈ చిట్కాను అభివృద్ధి చేశారు.
ఈ విధానంలో మలాశయం నుంచి ఆక్సిజన్ శరీరంలోకి చేరుతుంది. ఈ విధానంలో ఆక్సిజన్‌తో కూడిన ద్రవ పదార్థాన్ని రోగి శరీరంలోకి మలాశయం ద్వారా పంపిస్తారట. అనంతరం ఆ ద్రవపదార్ధంలోని ఆక్సిజన్ ప్రేగుల ద్వారా రక్తంలోకి చేరుతుందట. ఈ పద్ధతి సురక్షితమైనదేనని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిందట. ఊపిరితిత్తుల ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడే రోగులకు ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుందట. చేపలు, కొన్ని రకాల తాబేళ్లు, వానపాములు తమ మలాశయం ద్వారా శ్వాస తీసుకుంటాయట. వీటిని ప్రేరణగా తీసుకుని ఈ కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. పరిశోధకుడు డాక్టర్ టముహికో టకెబె ఈ టెక్నిక్‌పై స్పందిస్తూ… కొవిడ్ మహమ్మారి సమయంలో చాలా మంది రోగులు వెంటిలేటర్ల కొరత వల్ల మరణించారని, అలాంటి పరిస్థితుల్లో రోగులకు ఆక్సిజన్‌ను అందించేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ బ్యాకప్ శ్వాస వ్యవస్థ విజయవంతమైతే, రాబోయే కాలంలో ఇది వైద్య విజ్ఞాన శాస్త్ర దిశను మార్చవచ్చని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింటర్‌లో వింటేజీ రైలు జర్నీ.. ఈ మార్గంలో ప్రయాణం.. అస్సలు మిస్ కావొద్దు
