ధన త్రయోదశి అమ్మకాలు భారీగా ఉంటాయని బంగారం షాపుల వర్తకులు చాలా ఆశపడ్డారు. కానీ అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో అది కాస్తా పండుగ కొనుగోళ్లపై ప్రభావం చూపించింది. అందుకే గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి సేల్స్ దాదాపు 10 శాతం తక్కువగానే ఉన్నాయన్నారు. గత ఏడాది.. అంటే 2023లో ధనత్రయోదశి.. నవంబర్ 11న పడింది. అప్పుడు 999 స్వచ్ఛత ఉన్న 10 గ్రాముల బంగారం ధర 61 వేల 200 రూపాయిలు ఉంది. కిలో వెండి ధర 74 వేల రూపాయిలుగా ఉంది. ఇక ఈ ఏడాది ధన త్రయోదశి.. అక్టోబర్ 29న పడింది. ఆరోజున 10 గ్రాముల బంగారం ధర 81 వేల 400 రూపాయిలు ఉంది. కిలో వెండి ధర దాదాపు లక్ష రూపాయిలు ఉంది.
ధనత్రయోదశి సందర్భంగా అమ్మకాలు తగ్గినా.. దాని విలువను చూస్తే మాత్రం మంచి బిజినెస్ జరిగినట్లే అంటున్నారు వర్తకులు. ఎందుకంటే విలువ పరంగా 20 శాతం లేదా అంతకన్నా ఎక్కువ శాతమే పెరిగే ఛాన్సుంది అంటున్నారు వ్యాపారులు. అయితే ఈసారి వినియోగదారులు తమ దగ్గరున్న పాత ఆభరణాలను ఎక్స్ ఛేంజ్ చేసుకోవడానికే ఇంట్రస్ట్ చూపించినట్లు తెలుస్తోంది. పాతవి ఇచ్చి కొత్తవి కొనుగోలు చేశారు. సాధారణంగా.. ధనత్రయోదశికి ముందే చాలామంది ఆర్డర్లు ఇచ్చేస్తారు. కానీ ఈ పండగ రోజే తమకు డెలివరీ ఇవ్వాలని షాపుల వాళ్లను కోరుతారు. అలాంటి ఆర్డర్లు.. మొత్తం అమ్మకాల్లో దాదాపు 25 శాతం ఉంటాయని అంచనా. కానీ ఈసారి ఇలాంటి ఆర్డర్లు.. 10 శాతం కూడా లేవంటున్నారు. వివాహంతోపాటు శుభకార్యాలకు అవసరమైన మేరకు మాత్రమే కొందరు కొనుగోలు చేస్తున్నారు. ఇక మిగిలినవారిలో సంపన్నులతోపాటు ఎగువ మధ్యతరగతి వారు మాత్రమే గోల్డ్ ను కొనడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. మధ్యతరగతి వారికి అందే స్థాయిలో పుత్తడి లేదు. 10 గ్రాముల ధర దాదాపు 80 వేలు ఉండడంతో దానిని కొనడానికి వెనకడుగు వేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.