స్వల్పంగా పెరిగిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే!

Updated on: Jan 18, 2026 | 12:20 PM

గత ఏడాది అనూహ్యంగా పెరిగిపోయిన బంగారం వెండి ధరలు కొత్త ఏడాదిలోనూ దూసుకెళ్తున్నాయి. ఓ వైపు పండుగల సీజన్‌, మరోవైపు పెళ్లిళ్ల సీజన్‌ రాబోతోంది. ఈ క్రమంలో న్యూ ఇయర్‌లోనైనా బంగారం ధర తగ్గుతుందని ఎదురుచూసిన గోల్డ్‌ ప్రియులకు షాకిస్తూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యులు బంగారం వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించని పరిస్థితులు నెలకొంటున్నాయి. జనవరి 17 శనివారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది.

స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై రూ.380లు పెరిగి రూ.1,43,780లు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350లు పెరిగి రూ.1,31,800లు పలుకుతోంది. కేజీ వెండిపై రూ.4000 పెరిగి రూ. 3,10,000 లకు చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో శనివారం బంగారం, వెండి ధరలుఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,43,930, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,950 పలుకుతోంది. ముంబై లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,780 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,800 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.540లు పెరిగి రూ.1,44,870 లు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500లు పెరిగి, రూ.1,32,800 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,43,780 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ. 1,31,800 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,43,780 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,31,800 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.3,10,000 పలుకుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

సీఎంను చిప్స్‌ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్‌ ఇదే!

అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!

ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంటే..

కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!