Gold Price: దడ పుట్టిస్తున్న బంగారం ధర.! రూ.80,000లకు చేరువలో బంగారం ధర..

|

Oct 24, 2024 | 6:58 PM

దీపావళికి ముందు బంగారం ధరలు భగ్గుమన్నాయి. పండుగ సీజన్‌కు తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ పెరుగుతుండడంతో దేశీయంగా ధరలు దూసుకెళ్తున్నాయి. వరుసగా నాలుగోరోజు కూడా పసిడి పైకే ఎగిసింది. 10 గ్రాముల బంగారం ధర రూ.80 వేలకు చేరువలో ఉంది. కాగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో శనివారం బంగారం ధర ఎలా ఉందో చూద్దాం.

దేశరాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయలు పెరిగి, రూ.72,930లు పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.440 పెరిగి రూ.79,570లుగా ఉంది. ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400లు పెరిగి 72,800 పలుకుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440లు పెరిగి 79,420లుగా కొనసాగుతోంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడలోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే.. దేశంలో వెండి ధరలు చూస్తే..శనివారం వెండి ధర భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2000 పెరిగి, రూ.1,07,000 లను తాకింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.