Bank Insurance: బ్యాంకుల నుంచి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి!

|

Mar 03, 2024 | 6:00 AM

ఈ రోజుల్లో, ఇన్సూరెన్స్ ఏజెంట్ల తప్పుడు సమాచారం ద్వారా పాలసీలను విక్రయించడం గురించి మనం చాలా మంది నుంచి ఫిర్యాదులను వింటున్నాం. ఇలాంటి బీమా తప్పుడు విక్రయాన్ని అడ్డుకోవడానికి, ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయిన IRDA.. ఇప్పుడు 55 ఏళ్లకు పైబడిన వారి కోసం రూపొందించిన బీమా పాలసీల పరిశీలనను వేగవంతం చేయడం ద్వారా ముందడుగు వేసింది. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు రెండూ ఇందులో చేర్చారు.

ఇన్సూరెన్స్‌ని తప్పుగా విక్రయించే అనేక సందర్భాల్లో ప్రభుత్వం కూడా తీవ్రంగా ఆందోళన చెందుతోంది. ఇటీవల, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశం నిర్వహించారు. ఇక్కడ, వారు బీమా పాలసీలను విక్రయించేటప్పుడు ఆ ప్రాసెస్ ను వీడియో, ఆడియో రూపంలో రికార్డింగ్ చేయడం వంటి వివిధ ఆప్షన్స్ పై చర్చించారు. ఇది బీమా పాలసీని కస్టమర్ కు విక్రయించేటప్పుడు అతడు చేసిన ప్రామిస్ లు అన్నింటినీ అధికారికంగా రికార్డ్ చేయడం కోసమే. అయితే బ్యాంకుల నుంచి ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి.

Follow us on