వాహనదారులకు గుడ్‌ న్యూస్‌..

Updated on: Sep 03, 2025 | 4:44 PM

మీ ఇంట్లో వినియోగంలో లేని పాత కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయా? అయితే ఈ వార్త మీకోసమే. వినియోగంలో లేని, బహిరంగ ప్రదేశాల్లో తిరగని వాహనాలకు పన్ను చెల్లించనక్కర్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 29న ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు తీర్పు దేశవ్యాప్తంగా వాహన యజమానులకు అత్యంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.

బహిరంగ ప్రదేశాల్లో తిరగని లేదా ఏమాత్రం వినియోగంలో లేని వాహనాలకు మోటారు వాహన పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. గత ఏడాది డిసెంబరులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం పన్ను విధింపుపై స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. రోడ్లు, హైవేల వంటి ప్రజా మౌలిక సదుపాయాలను వినియోగించుకున్నందుకు ప్రతిఫలంగా వాహన యజమానులు పన్ను చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేసింది. కానీ, వాహనం రోడ్లపై తిరగకుండా, పూర్తిగా వాడకంలో లేకుండా పక్కన పట్టేసిన వాహనాలకు వాటి యజమాని ప్రభుత్వ మౌలిక సదుపాయాల నుంచి ఎలాంటి ప్రయోజనం పొందినట్లు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో, వాహనం వినియోగంలో లేని కాలానికి యజమానిపై మోటారు వాహన పన్ను భారం మోపడం సరికాదని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో వాడకుండా నిలిపివేసిన వాహనాలు ఉన్న యజమానులకు పెద్ద ఊరట లభించినట్లయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kannappa: ఎట్టకేలకు OTTలోకి కన్నప్ప మూవీ..! విష్ణు తెలివే వేరబ్బా..!

సినిమా చేస్తే సరిపోతుందా? ప్రమోషన్స్‌కి డుమ్మా కొడితే ఎలా? అనుష్క తీరుపై విమర్శలు

రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో లేడీ ప్రొఫెసర్‌కు వేధింపులు

100కోట్ల రేంజ్‌ అవుట్ పుట్ దిమ్మతిరిగే కాన్పెప్ట్.. హిట్టా..? ఫట్టా..?