బంగారానికి బాబులా వెండి ధర.. కిలో రూ.1 లక్ష.. కొంటే మంచిదేనా ??
మొన్న బంగారం పది గ్రాములు లక్ష రూపాయిలు అవుతుందా అన్న ప్రశ్న ఎదురైంది. మొత్తానికి 10 గ్రాముల పుత్తడి ధర 80 వేలు దాటి రికార్డ్ సృష్టించింది. అయితే లక్ష రేసులో గోల్డ్ కన్నా ముందు వెండి దూసుకొచ్చింది. ఇప్పుడు కేజీ వెండి ధర అక్షరాలా లక్షా 10 వేల రూపాయిలు. తొలిసారిగా ఇది లక్ష మార్క్ ను దాటింది. కేజీ వెండి లక్ష దాటిందా అంటూ చాలామంది నోరెళ్లబెట్టవచ్చు. కానీ ఇది నిజం.
నిజానికి నిత్య వాడుకలో బంగారానికి ఉన్నంత డిమాండ్ వెండికి ఉండదు. పూజా సామగ్రి, భోజన సామగ్రి.. ఇంకా కొన్ని వస్తువుల కోసం ఎక్కువగా వెండిని ఉపయోగిస్తారు. ఈమధ్యకాలంలో సిల్వర్ జువెలరీ బాగా పాపులర్ అవుతోంది. కొన్నిచోట్ల వెండి ఆభరణాలకు గోల్డ్ కోటింగ్ కొట్టి విక్రయిస్తున్నారు. పైగా వీటి ధర కూడా తక్కువగా ఉండడంతో చాలామంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. మరి వీటన్నింటివల్లా వెండి ధర పెరుగుతోందా అంటే.. అవును అని చెప్పలేం. నిజానికి వెండి వాడకం పారిశ్రామికంగా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనికి ఇంత రేటు అంటున్నాయి వ్యాపార వర్గాలు. ఈసారి బడ్జెట్ లో కేంద్రం కూడా వెండిపై ట్యాక్స్ ను తగ్గించింది. 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో ఎక్కువమంది.. వెండిని ఇన్వెస్ట్ మెంట్ కోసం కొనడానికి ఆసక్తి చూపించారు. బంగారం కన్నా ఎక్కువ లాభాలు వస్తాయన్న అంచనాలు కూడా వారిలో ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం సిల్వర్ ఆర్నమెంట్స్ కు కూడా డిమాండ్ పెరిగింది. నిజానికి వెండిని ఆభరణాల కోసం వినియోగించేది.. 20 శాతం మాత్రమే.. మిగిలిన 80 శాతాన్ని పారిశ్రామిక అవసరాల కోసమే ఉపయోగిస్తారు. అంటే దీని వినియోగం ఎంత పెరిగితే.. వెండికి అంత డిమాండ్ తో పాటు ధర కూడా పెరుగుతుంది. ఈ ఒక్క లెక్కే చాలామంది వెండిపై పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడేలా చేసింది. నిజానికి ఈ ఏడాది మే నెలలో కిలో వెండి 96 వేల రూపాయిలపైనే పలికింది. ఇప్పుడు లక్షా పదివేలకు చేరింది. అంటే ఐదు నెలల వ్యవధిలోనే 14 వేల రూపాయిలు పెరిగింది. దీని ధర లక్ష రూపాయిలకు పెరుగుతుంది అని అప్పట్లోనే అంచనా వేశారు. కాకపోతే ఇంత త్వరగా పెరుగుతుందని ఊహించలేదు. అందుకే ఇప్పుడు అందరి దృష్టీ సిల్వర్ పై పడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోజుకు ఒక గుప్పెడు తిన్నా.. ఊహించలేనన్ని బెనిఫిట్స్ !!
Aadhar Card: మీ ఆధార్ కార్డులో తప్పులుంటే ఎలా సరి చేసుకోవాలి ??
TOP 9 ET News: గంగవ్వకు గుండెపోటు వచ్చిందా ?? క్లారిటీ