క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Updated on: Nov 07, 2025 | 4:13 PM

కొంత కాలంగా గ్రోసరీ కొనుగోళ్లతో పాటు బంగారు నగలు కొనడానికి కూడా క్రెడిట్‌ కార్డులను వాడుతున్నారు. వివాహాలు, పండుగల సమయంలో నగల షాపింగ్ మరింత పెరుగుతుంది. సహజంగా, ఈజీ కావడంతో చాలా మంది దీనికి కూడా క్రెడిట్ కార్డులు వాడటం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. చాలా క్రెడిట్‌ క్రెడిట్‌ కార్డు సంస్థలు..బంగారు నగల కొనుగోళ్లపై రివార్డ్‌ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

అయితే నగల కొనుగోళ్లకు క్రెడిట్‌ కార్డును వాడటం లాభమా, నష్టమా అనే విషయాన్ని తెలుసుకుందాం. క్రెడిట్‌ కార్డుతో నగలు కొన్న తర్వాత ఏదైనా కారణాలతో మొత్తాన్ని టైమ్‌లోగా చెల్లించకపోతే, క్రెడిట్‌ కార్డులపై వార్షికంగా 35-40% వరకు వడ్డీ మోత ఉంటుంది. ఇక.. నగల కొనుగోలు అంటే పెద్దమొత్తమే ఉంటుంది గనుక.. అసలు, వడ్డీ కలిపితే మోత మోగిపోతుందని గుర్తుంచుకోవాలి. బంగారాన్ని క్రెడిట్ కార్డు మీద కొనుగోలు చేస్తే జ్యూవెలరీ దుకాణాలు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి. ఇది 2 శాతం నుంచి 3.5 శాతం వరకు ఉండొచ్చు. బంగారు నగలు, గోల్డ్ కాయిన్స్ కొనడానికి క్రెడిట్ కార్డు వాడితే చాలా బ్యాంకులు EMI అవకాశం ఇవ్వవు. అంటే బిల్ డేట్ లోపు మొత్తం తిరిగి చెల్లించాలన్నమాట. ఈ విషయం తెలియకపోతే వడ్డీ మోయలేని భారంగా మారుతుందని తెలుసుకోవాలి. ఇక.. కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డుపైన గోల్డ్ కొనుగోలు చేస్తే రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్ ఇస్తాయి. అయితే చాలా సార్లు అవి ఒక్క బ్రాండ్ కే పరిమితం అవుతుంటాయి. అంటే.. ఏదో ఒక షాప్ నుంచి గోల్డ్ కొంటేనే అవి వర్తిస్తాయి గనుక పెద్దగా ఉపయోగం ఉండదని గుర్తుంచుకోవాలి. కొంత మంది తరువాత చెల్లించవచ్చులే అనుకుని అధికంగా ఖర్చు చేస్తారు. కార్డును సరిగ్గా మానేజ్ చేయకపోతే, అది ఆర్థిక భారం అవుతుంది. కనుక.. బంగారు నగలు కొనాలనుకుంటే.. చేతిలో తగినంత డబ్బు ఉంటేనే కొనటం లేదంటే 100 శాతం తిరిగి చెల్లించగలం అనుకుంటేనే క్రెడిట్ కార్డుతో బంగారు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి కొన్ని బ్యాంకులు..క్రెడిట్ కార్డ్ రంగంలో చాలా దూకుడుగా ఉన్నాయి. గతంలో క్రెడిట్‌ కార్డు సంస్థలు..బంగారు ఆభరణాలపై EMI ఇచ్చేవి. కానీ, 2013లో, బంగారం దిగుమతులు, రిటైల్ వినియోగాన్ని నియంత్రిస్తూ RBI చర్యలు తీసుకుంది. క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన బంగారు కొనుగోళ్లను EMIలుగా మార్చవద్దని బ్యాంకులను ఆదేశించింది. బ్యాంకు శాఖల్లో క్రెడిట్‌ కార్డులతో బంగారు నాణేలను కొనుగోలు చేయడానికి వీలు లేకుండా చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవుడితోనే ఆటలా… హుండీలో బొమ్మ నోట్లు

పాత బ్యాంకు ఖాతాలలో డబ్బు మర్చిపోయారా ?? అయితే ఈ విధంగా చేయండి

సాఫ్ట్‌వేర్ కొలువుల ఊచకోత.. లక్ష దాటిన తొలగింపులు

ఇది కదా సాయం అంటే.. తల్లి వర్థంతి వేళ.. రైతుల అప్పులు తీర్చాడు

TOP 9 ET News: ‘శభాష్‌ రామ్‌ చరణ్‌! మంచి నిర్ణయం తీసుకున్నావ్‌..’